అందరూ తెలుసుకోండి.. మనకు క్యాన్సర్ వచ్చేలా చేసే వంటింట్లో వస్తువులు ఇవి.. !
Published on: Fri Sep 25, 2026 9:27AM
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. అయితే కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా సరే కొందరికి ఈ వ్యాధి బారిన పడటం మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం మనం రోజువారీ జీవితంలో, ముఖ్యంగా మన వంటింట్లో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు , వంటల్లో వాడే కొన్ని పదార్ధాలే కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన కిచెన్ లో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని వండే పద్ధతుల వల్ల క్యాన్సర్ కలిగించే కారకాలు (కార్సినోజెన్లు) తయారవుతాయట. వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
మన వంటింట్లో క్యాన్సర్ ముప్పును పెంచే ప్రధాన అంశాలు , వాటి వివరాలు తెలుసుకుంటే..
అతిగా మాడ్చిన పదార్థాలు (ఆక్రిలమైడ్)..
ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే దాదాపు 120 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు, లేదా మాడిపోయే వరకు వేయించినప్పుడు వాటిలో ఆక్రిలమైడ్ అనే రసాయన కాంపౌండ్ తయారవుతుంది. ఎక్కువగా వేయించిన బంగాళాదుంపలు, మాడిపోయిన దోసలు, పరోటాలు, డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారిన బ్రెడ్ టోస్ట్, కొన్ని రకాల బిస్కెట్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత డిఎన్ఏ పై ప్రభావం చూపి జన్యు మార్పులకు కారణమవుతుంది. కాబట్టి వంటలను నల్లగా మాడకుండా దోరగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవడం మంచిది.
క్యూబా వేయించిన మాంసాహారం (హెట్రోసైక్లిక్ అమైన్స్)..
చికెన్, మటన్, చేపలు వంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్న మాంసాహారాన్ని అధిక వేడి మీద ఎక్కువగా వేయించినప్పుడు లేదా గ్రిల్ చేసినప్పుడు ఈ కాంపౌండ్లు ఏర్పడతాయి. చికెన్ లేదా మటన్ ను నల్లగా మాడ్చి తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.
నిప్పులపై నేరుగా కాల్చిన వంటకాలు (పాలోసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్)..
బొగ్గులు లేదా నేరుగా గ్యాస్ మంటపై పెట్టి మాంసాన్ని లేదా ఇతర పదార్థాలను కాల్చినప్పుడు వాటిపై నల్లటి బొగ్గు లాంటి పొర ఏర్పడుతుంది. ఈ రసాయనాలు డిఎన్ఏ నిర్మాణాన్ని దెబ్బతీసి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి.
మళ్లీ మళ్లీ వాడిన నూనె (రిపీటెడ్ కుకింగ్ ఆయిల్):
ఒకసారి వాడిన నూనెను పదే పదే వేడి చేసి వాడటం మన ఇళ్లలో చాలా సాధారణం. కానీ నూనెను పదే పదే మరిగించడం వల్ల అందులో అనేక హానికరమైన ఆక్సిడైజ్డ్ కొవ్వులు, పాలిమర్స్, ఆల్డిహైడ్స్ ఉత్పన్నమవుతాయి. ఇవి శరీరంలోని జీన్స్ స్థాయిలోకి వెళ్లి క్యాన్సర్ కారకాలుగా మారతాయి.
నిల్వ ఉంచిన ధాన్యాల్లో బూజు (అఫ్లాటాక్సిన్స్)..
వేరుశెనగ పప్పులు, జొన్నలు, సజ్జలు, రైస్, గోధుమలు లేదా పప్పు ధాన్యాలను సరిగ్గా నిల్వ చేయనప్పుడు తేమ చేరి వాటిపై ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ (బూజు) ఏర్పడుతుంది. ఈ ఫంగస్ విడుదల చేసే అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం నేరుగా కాలేయం (లివర్) పై దాడి చేసి, లివర్ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి నిల్వ ఉంచే ధాన్యాలను తడి లేకుండా పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ప్రిజర్వ్ చేసిన ఆహారాలు , సాసె లు (నైట్రోజమైన్స్):
ప్యాక్ చేసిన ఆహారాలు, డబ్బాల్లో నిల్వ ఉండే మాంసం, నగ్గెట్స్, వివిధ రకాల సాసెస్ లలో నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయనాలు, వీటిలో నైట్రేట్స్ ప్రధానమైనవి. ఇవి కడుపులోకి వెళ్లాక నైట్రోజమైన్స్ గా మారి డిఎన్ఏను దెబ్బతీస్తాయి.
అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం:
మటన్, బీఫ్, పోర్క్ వంటి రెడ్ మీట్ ను పరిమితికి మించి తరచూ తీసుకోవడం వల్ల కూడా పెద్దపేగు క్యాన్సర్ అయిన కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
తాగునీటిలో ఆర్సెనిక్..
కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో (బోర్ నీటిలో) ఆర్సెనిక్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అలాంటి నీటితో పండించిన బియ్యం లేదా ఆ నీటితో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో క్రోమోసోమల్ లోపాలు వచ్చి అనారోగ్యం పాలవుతారు. దీనికి పరిపరిష్కారంగా నీటిని పరిక్షించుకోవడం లేదా రైస్ వండేటప్పుడు ఎక్కువ నీరు పోసి ఉడికించిన తర్వాత గంజి వార్చడం వల్ల ఈ రసాయనాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్స్ (ఫ్యూరాన్ కాంపౌండ్స్)..
ప్యాక్ చేసిన సీల్డ్ ఫుడ్స్, అధిక వేడి వద్ద స్టెరిలైజ్ చేసిన ఇన్స్టంట్ బేబీ ఫుడ్స్, కప్ నూడుల్స్ వంటి పదార్థాల్లో ఫ్యూరాన్ కాంపౌండ్లు ఉంటాయి. చిన్నపిల్లలకు బయట దొరికే ప్యాక్డ్ సీరియల్స్ కంటే ఇంట్లో ఫ్రెష్ గా తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడమే ఆరోగ్యానికి మంచిది.
వంటల్లో మద్యం ఉపయోగించడం (అసిటాల్డిహైడ్)..
కొందరు బిర్యానీలు, కేకులు లేదా కొన్ని రకాల వంటకాల తయారీలో రుచి కోసం ఆల్కహాల్ వాడుతుంటారు. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లాక అసిటాల్డిహైడ్ గా మారి క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఆహారాన్ని అధిక వేడి మీద నల్లగా మాడిపోయేలా వండకూడదు. వంటగదిలో మంచి గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. గదుల్లో బల్బ్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
నూనెను పదే పదే వాడకుండా, నిల్వ పదార్థాలకు దూరంగా ఉంటూ, ఫ్రెష్ గా ఇంట్లో వండుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.


.webp)
