TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎల్ నినో ఎఫెక్ట్: ఐరోపాలో మృత్యు ఘోష.!

Published on: Sat Oct 24, 2026 11:13AM

ఆహ్లాదకర వాతావరణం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఐరోపా ఖండం. చల్లటి వాతావరణం, మనసును మైమరపింప చేసే పర్యాటక ప్రాంతాలకు నెలవైన ఐరోపాపై ఎల్ నినో ప్రభావం అక్కడి పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది.   ఈ సారి వేసవి ఐరోపాలో ఎడారి వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఎల్‌నినో ప్రభావంతో ఐరోపాలో ఏడు వేసవి నిప్పులు చెరిగింది. ఆసాధారణ ఉష్ణోగ్రతలతో జనం మలమల పాడిపోతున్నట్లుగా ఫీలౌతున్నపరిస్థితి.  జూన్, జులై, ఆగస్టు నెలల్లో సంభవించిన భీకర వడగాల్పుల ధాటికి ఐరోపాలోని వివిధ దేశాల్లో ఏకంగా 50 వేల 400 మంది వరకూ మృత్యువాత పడ్డారు. 

ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకుల అధ్యయనం మేరకు గతంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన 2022 వేసవితో పోలిస్తే, ఈ  ఏడాది మరణాల సంఖ్య ఏ 71 శాతం పెరిగింది.  సాధారణంగా ఐరోపా దేశాల్లో ఉష్ణోగ్రతలు 12 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. అయితే ఈ ఏడాది ఫ్రాన్స్‌లో గరిష్ఠంగా 43.8 డిగ్రీల సెల్సియస్, జర్మనీలో 41.7 డిగ్రీలు, బ్రిటన్‌లో   37.3 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా మండించడం వల్ల వాతావరణం వేడెక్కి  ప్రాణ నష్టం సంభవించిందని ఆ అధ్యయనం పేర్కొంది. 

ఈ విపరీత వాతావరణం కారణంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల ప్రజలు అత్యధికంగా బలయ్యారు. జూన్ 17 నుండి జులై 1 మధ్య కాలంలో వడగాలులు  తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, ఒక్క ఆ పక్షం రోజుల వ్యవధిలోనే మూడో వంతు మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే. 85 ఏళ్లకు పైబడిన వారే సగం మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  


[Elnio Effect Europe Heat Wave, El Nino Europe Deaths, Imperial College London Study, Extreme Summer Temperatures, TeluguOne]