తిరుచానూరు పద్మావతి ఆలయంలో గజరాజు భీబత్సం.. మావటికి తీవ్ర గాయాలు.!
Published on: Mon Oct 5, 2026 9:36AM

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం(అక్టోబర్ 4) సాయంత్రం ఆలయానికి చెందిన శ్రీనిధి అనే ఆస్థాన గజరాజు ఒక్కసారిగా హింసాత్మకంగా ప్రవర్తించి తన మావటిపైనే దాడికి పాల్పడింది. ఈ ఊహించని ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఏనుగు ఘీంకారాలు, హడావుడితో అక్కడ ఉన్న భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మావటిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
.webp)
ఆదివారం సాయంత్రం ఆలయంలోని వాహన మండపంలో నిర్వహించతలపెట్టిన ఊంజల్‌సేవ కోసం శ్రీనిధి, అవనిజ అనే రెండు ఏనుగులను గజశాల నుంచి బయటకు తీసుకువచ్చారు. మూడో నంబరు గేటు గుండా ఈ గజరాజులను ఉత్సవ వేదిక వైపునకు తీసుకు వెడుతుండగా ఈ ఘటన జరిగింది. రథం సమీపంలో గోశాల సిబ్బంది గేటు తీస్తున్న తరుణంలో శ్రీనిధి అనే ఏనుగు అకస్మాత్తుగా వ్యక్తిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.

ఆ సమయంలో అక్కడే ఉన్న మావటి చంద్రశేఖర్ అప్రమత్తమై ఆ ఏనుగును అంకుశంతో ఏనుగును నియంత్రించేందుకు యత్నించాడు. అయితే ఏనుగు తిరగబడి మావటిని తొండంతో ఎత్తి కిందపడేసింది. ఆ తర్వాత నేలపై పడి ఉన్న చంద్రశేఖర్ ఛాతీపై తన కాలుతో తొక్కడంతో పాటు తొండంతో విసిరికొట్టింది. ఈ ఘటనలో మావటి చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
[Elephany Attack, Tiruchanur Temple, Attack Elephant Srinidhi, Mahout Chandrasekhar, TTD elephants, Pilgrims, Panic]


