ఫిబ్రవరి నాటికి పీక్స్ కి ఎల్నినో ఎఫెక్ట్: ఇప్పటికే ఆందోళనకరంగా భూగర్భ జల మట్టాలు.!
Published on: Thu Oct 15, 2026 5:08PM
ఎల్ నినో ఎఫెక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పీక్స్ కు చేరునుంది. తెలంగాణలో ఎల్ నినో ప్రభావం తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఇప్పటికే భూగర్భ జల మట్టాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. రానున్న రోజులలో నీటి సరఫరా, వ్యవసాయం పెను సవాళ్లు ఎదుర్కోనున్నాయి. వాతావరణ మార్పులు, సాగు పరిస్థితిపై గురువారం జరిగిన సమీక్షలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఈ విషయాలను వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్నినో ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్.. సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ, భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు. రైతాంగం కష్టాలకు ఉచిత విద్యుత్ మాత్రమే పరిష్కారం కాదని వివరించారు. బావులు, బోరుబావుల్లో నీటి ఊటలు లేకపోవడంతో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ నిష్ప్రయోజనమేనన్నారు. ఉణ్న నీటి నిల్వలను కాపాడుకుంూ, తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించారు.
రాబోయే పక్షం రోజులూ పంటలకు అత్యంత కీలకమన్న ఆయన.. రైతాంగానికి తగిన మార్గదర్శకత్వం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులనుఆదేశించారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా మేనేజ్ చేయాలనీ, జలవనరులు, వ్యవసాయం, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
[El Nino Impact Telangana, Sanjay Jaju Chief Secretary, Telangana Drinking Water Crisis, Singur Dam, Water Review, Ground Water Levels, Telugu One]


