TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజూ కోడిగుడ్డు తింటే, కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల కీలక వివరణ!

Published on: Wed Oct 21, 2026 10:13AM

కోడిగుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ మల్టీ విటమిన్ ఆహారంగా కోడిగుడ్డును పరిగణిస్తారు. ఇందులో విటమిన్ 'సి' మినహా దాదాపు అన్ని రకాల పోషకాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. జుట్టు రాలడం నుండి కాలి గోరు వరకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా సరే, క్రమం తప్పకుండా కోడిగుడ్డు తింటే శరీరానికి పూర్తి బలం చేకూరుతుంది, రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది మరియు తగినంత అధిక ప్రొటీన్ లభిస్తుంది అని కరీంనగర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా కోడిగుడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని ఆయన స్పష్టం చేశారు. ఉదయం వేళల్లో గుడ్లు తినడం వల్ల పొట్ట రాకుండా ఉండటమే కాకుండా, బ్లడ్ ప్రెషర్ (బీపీ) మరియు షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

అయితే, కోడిగుడ్ల విషయంలో చాలామందిలో ఇప్పటికీ ఒక అపోహ అలానే కొనసాగుతోంది. గుడ్డు పచ్చసొన (Egg Yolk) లో కొలెస్ట్రాల్ ఉంటుందని, దానిని తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి గుండెపోటు (Heart Attack) వస్తుందని చాలామంది బలంగా నమ్ముతుంటారు. ఈ భయంతోనే ఎంతోమంది ఉడికించిన గుడ్డులో కేవలం తెల్లసొన మాత్రమే తిని, లోపల ఉండే పచ్చసొనను బయటపారేస్తుంటారు. అలాగే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూడా పచ్చసొనను పూర్తిగా తొలగించేస్తుంటారు. కానీ ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని డాక్టర్ విక్రాంత్ సింగ్ స్పష్టం చేశారు. వాస్తవానికి మనం తినే ఆహారం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగేది కేవలం 10 నుండి 20 శాతం మాత్రమే. శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌లో ఏకంగా 80 నుండి 90 శాతం వరకు మన కాలేయం (Liver) స్వయంగా తయారు చేసుకుంటుంది. కాబట్టి కోడిగుడ్డు తినేటప్పుడు తప్పకుండా పచ్చసొనతో సహా పూర్తి గుడ్డును తినాలని ఆయన సూచించారు.

చాలామంది కొలెస్ట్రాల్ వల్లనే గుండెపోటు వస్తుందని అపోహ పడుతుంటారు, కానీ అది పూర్తిగా అవాస్తవం అని డాక్టర్ విక్రాంత్ తెలిపారు. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్రడానికి ఫైరింజన్ ఎలా వస్తుందో, సరిగ్గా అలాగే మన రక్తనాళాల్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అనగా వాపు లేదా మంట ఏర్పడినప్పుడు దానిని నివారించడానికి అక్కడికి వెళ్లేదే కొలెస్ట్రాల్. అసలు మంట రావడానికి అసలు కారణం ఏమిటో గుర్తించి దానిని సరిదిద్దాలి తప్ప, మంటను ఆర్రడానికి వచ్చిన రక్షకులను తప్పుపట్టడం ఎంత తప్పో, కొలెస్ట్రాల్‌ను నిందించడం కూడా అంతే తప్పు అని ఆయన వివరించారు. రక్తం లోపల చక్కెర (Sugars) మోతాదు అధికమైతే రక్తనాళాల్లో ఈ సమస్య వస్తుంది. మన రక్తనాళం లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ 4 గ్రాముల కంటే ఎక్కువ షుగర్ ఉండకూడదని ఆయన హెచ్చరించారు. అందుకే మన శరీరంలో ఇన్సులిన్ అనే అద్భుతమైన హార్మోన్‌ను దేవుడు ఏర్పాటు చేశాడని పేర్కొన్నారు. ఎప్పుడైతే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయో, అప్పుడు రక్తనాళాల్లో వాపు వచ్చి, ఆ మంటను నియంత్రించడానికి కొలెస్ట్రాలే స్వయంగా వెళ్లి అక్కడ ఒక రక్షిత పొరను ఏర్పాటు చేస్తుంది. అయితే కాలక్రమేణా ఇదే సమస్యగా మారుతుంది కాబట్టి, ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ సరైన జీవనశైలిని పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

 

 

Does eating eggs daily increase cholesterol, egg yolk and cholesterol myth, doctors opinion on daily eggs, high cholesterol and eggs, egg nutrition benefits, safe egg intake per day, eggs and heart health.