ఏపీ మద్యం స్కాం కేసు: మాజీ మంత్రి అంబటిక ఈడీ నోటీసులు.!
Published on: Tue Nov 3, 2026 1:17PM
.webp)
వైసీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఏపీ మద్యం రవాణా టెండర్లలో చోటుచేసుకున్న అక్రమాలు, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో శోధనలు ముమ్మరం చేసిన ఈడీ, ఆయనను హైదరాబాద్‌లోని తమ జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
గతంలోనే ఈడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా అంబటి రాంబాబుకు పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ, ఆయన హాజరు కాలేదు. తనకు గుండె శస్త్రచికిత్స జరిగి స్టెంట్లు వేశారని, వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నందున ఆరోగ్యం కుదుటపడిన తర్వాత విచారణకు హాజరవుతానని ఆయన గతంలో ఈడీకి లిఖితపూర్వక సమాచారం అందించారు. దానికి సంబంధించిన వైద్య నివేదికలను కూడా అధికారులకు పంపించారు. అయితే, కేసు దర్యాప్తు వేగవంతమైన నేపథ్యంలో అధికారులు తాజాగా మరోసారి సమన్లు జారీ చేసి కచ్చితంగా విచారణకు రావాలని స్పష్టం చేశారు.
విచారణకు హాజరయ్యే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను తీసుకురావాలని ఈడీ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లతో పాటు 2019 సంవత్సరం నుంచి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న కంపెనీల వివరాలు, దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలు, బ్యాంకు ఖాతాల స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించారు.

కాగా, ఈ నోటీసులపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ పార్టీ నేతలను మానసికంగా వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. నోటీసుల పేరుతో బెదిరించాలని చూసినా తాము భయపడేది లేదని, న్యాయపరంగానే ఈ కేసులను ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
[ED Summons Ambati Rambabu, AP Liquor Transport Scam Case, Enforcement Directorate, Former Minister, YCP Leader, Telugu One]


