TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగాల్ బొగ్గు కుంభకోణం..హైదరాబాద్‌లో ఈడీ సోదాలు..!

Published on: Fri Sep 11, 2026 1:43PM

 హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏఎన్‌ఆర్ కంపెనీకి సంబంధించిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కలకత్తాలో నమోదైన కేసుకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కేవలం హైదరా బాద్‌ లో మాత్రమే కాకుండా హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, జార్ఖండ్, కలకత్తా ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కలకత్తా నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని ఏఎన్‌ ఆర్ కంపెనీకి సంబంధిం చిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

కలకత్తాలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే హైదరాబాద్‌లోని ఏఎన్‌ఆర్ కంపెనీపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కీలక పత్రాలు, ఇతర రికార్డు లను అధికారులు పరిశీలి స్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. కలకత్తాలో నమోదైన కేసుకు హైదరాబాద్‌లోని ఏఎన్‌ఆర్ కంపెనీకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ సోదాల్లో ఎలాంటి కీలక ఆధారాలు బయటపడను న్నాయి? అనే అంశాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కలకత్తా కేసు.. హైదరాబాద్‌లో సోదాలు.. నాలుగు రాష్ట్రాల్లో ఈడీ ఆపరేషన్ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సేకరిస్తున్న సమాచారం, స్వాధీనం చేసుకునే పత్రాలు, తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. ఈడీ సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు వెల్లడించే వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
.


[ ED searches in Hyderabad, Bengal coal scam, ANR Company, ED, Calcutta, PM MODI, Minister kishan reddy, Telugu One, Telugu News ]