TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలలో ఈడీ దాడులు: పూణె కేసు ఆధారంగా తనిఖీలు.!

Published on: Fri Oct 23, 2026 2:20PM

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు కలకలం రేపాయి.  . ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఫేక్ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ముసుగులో అమాయకులను మోసగించి, భారీ మొత్తంలో సొమ్మును కొల్లగొడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్, విజయవాడతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు కీలక ప్రాంతాలలో శుక్రవారం (అక్టోబర్ 23)  మెరుపుదాడులు నిర్వహించింది. మహారాష్ట్రలోని పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక  ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి.

మనీలాండరింగ్ నిరోధక చట్టం   కింద ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వివిధ ఆకర్షణీయ  పథకాలు, నకిలీ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ద్వారా ఈ ముఠాలు ప్రజలను ఆకర్షించి, స్వల్ప కాలంలోనే ఎక్కువ లాభాలంటూ ప్రలోభపెట్టి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.   ఇలా అక్రమ మార్గాల్లో బాధితుల నుంచి కొల్లగొట్టిన భారీ మొత్తాన్ని నిందితులు   విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది.

హవాలా మార్గాల ద్వారా నిధుల మళ్ళింపు ఎలా జరిగింది? ఈ కుంభకోణంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు,  డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ బృందాలు పరిశీలిస్తున్నాయి.  ఈ తనిఖీల ద్వారా అభించిన  లభించిన ఆధారాలతో  ఈడీ మరిన్ని తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


[ED Raids Telugu states, ED Searches Hyderabad Vijayawada, Online Betting Scam, Investment APPs  Enforcement Directorate, Telugu One]