TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హస్తినలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత.!

Published on: Wed Oct 7, 2026 10:56AM

హస్తినను భూ కంపం కుదిపేసింది. మంగళవారం (సెప్టెంబర్ 6) రాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  ఉత్తరాఖండ్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంప ప్రభావం కేవలం ఢిల్లీపైనే కాకుండా దేశంలో   రాష్ట్రాలపై కూడా  ప్రభావం చూపింది. 

మంగళవారం (సెప్టెంబర్ 6)  రాత్రి పదిన్నర గంటల సమయంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై  4.4గా నమోదైంది.  ఉత్తరాఖండ్‌లోని ఖదున్ లగా గవాలి ప్రాంతానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర స్థానం ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం   చుట్టుపక్కల రాష్ట్రాలలో కనిపించింది.

ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, ఢిల్లీ ఎన్సీఆర్  పరిధిలోని పలు ప్రాంతాలలోనూ ఈ ప్రకంపనలు  సంభవించాయి. అఅాగే  పొరుగునున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది.  కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.  

 [Earthquake Delhi Uttarakhand, Delhi Earthquake, North India Tremors, Rector Scale, Telugu One]