Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లైసెన్స్ లేని డ్రైవింగ్...వారం రోజుల్లో 1,940 కేసులు
posted on: Mar 7, 2026 6:37PM

నగరంలో రోడ్డు ప్రమా దాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు దిగింది. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టి భారీగా కేసులు నమోదు చేసింది. ఈ నెల 1 నుంచి 7 తేదీల మధ్య హైదరాబాదు నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు మరియు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విస్తృతం గా తనిఖీలు నిర్వహిం చారు. తనిఖీల్లో వాహన దారులను ఆపి వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించగా, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురు గుర్తించబడ్డారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ యాక్ట్, 1988 ప్రకారం మొత్తం 1,940 కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
లైసెన్స్ లేకుండా వాహనం నడపడం తీవ్రమైన నేరమని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇది ఇతర రోడ్డు వినియోగదా రుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి ప్రమాదానికి గురైతే వాహన బీమా క్లెయిమ్‌లను బీమా కంపెనీలు తిరస్కరించే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. అటువంటి సందర్భాల్లో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, వైద్య ఖర్చులు, ఆస్తి నష్టం వంటి అన్ని ఆర్థిక బాధ్యతలను వాహన యజమాని లేదా డ్రైవర్‌నే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మైనర్లకు లేదా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులు, వాహన యజమానులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, డ్రైవింగ్ సమయంలో వెంట ఉంచుకోవాలని ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ D. జోయల్ డేవిస్ సూచిం చారు. నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపర్చేం దుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.






