ఇండియన్ల అమెరికా డ్రీమ్ పై ట్రంప్ నీళ్లు.!
Published on: Tue Aug 25, 2026 9:45AM

ఇండియన్ల అమెరికా కలపై డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. అమెరికాలో ఐటీ రంగంలో స్థారపడాలని కలలు కనే ఇండియన్ టెక్కీలకు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా సర్కార్ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై విధించే ఫీజులను భారీగా పెంచేందుకు ప్రతిపాదించింది. భారత కరెన్సీలో ఈ పెంపు ప్రతిపాదన 86 లక్షల రూపాయలు. ఇప్పటివరకు విదేశీ ఉద్యోగ నియమకాల వ్యయానికి ఈ భారీ మొత్తం తోడవడం ఐటీ కంపెనీలతో పాటు టెక్ నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నది.
అమెరికా ఏటా జారీ చేసే మొత్తం 85 వేల క్యాప్ సబ్జెక్ట్ హెచ్-1బీ వీసాలన్నింటికీ ఈ నూతన అదనపు రుసుము వర్తించనుండటం గమనార్హం. ఇందులో భాగంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల నుండి మాస్టర్స్, ఉన్నత విద్యను పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయించే 20 వుల మాస్టర్స్ కోటా వీసాలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. సాధారణ దరఖాస్తు రుసుములతో పాటు 86 లక్షల రూపాయల అదనపు మొత్తాన్ని కూడా ఉద్యోగాన్ని ఇచ్చే సంస్థలే భరించాల్సి ఉంటుంది.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంచనాల ప్రకారం ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి ఏటా 8.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. ఈ భారీ నిధులను ప్రధానంగా వలస దరఖాస్తుల పరిశీలన, వీసా మోసాల గుర్తింపు, జాతీయ భద్రత తనిఖీలు, పాత ప్రభుత్వ వ్యవస్థల ఆధునికీకరణ కోసం వినియోగిస్తామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది.
అయితే ఈ ప్రతిపాదనను అమెరికన్ వ్యాపార వర్గాలు, ఐటీ నిపుణులు తీవ్రంగా ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కంపెనీలు అంతర్జాతీయ నైపుణ్యాన్ని అమెరికాకు తీసుకురావడం ఈ నిబంధన వల్ల చాలా కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఈ ఫెడరల్ ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజలు, సంస్థల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఇండియన్ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
Donald Trump Propose huge hike on H1B Visa Fee, H1B Visa 86 Lakh Fee Hike, US Immigration Policy, Homeland Security, H1B Visa Master Cap Fee


