TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోనార్క్‌లా వ్యవహరిస్తున్న ట్రంప్‌కు కోర్టుల్లో ఎదురు దెబ్బలు

Published on: Thu Feb 26, 2026 4:50PM

 

రెండో సారి అమెరికా ప్రెసిడెంట్‌ అయిన డోనాల్డ్ ట్రంప్ .. అగ్రదేశ అధినేతగా ప్రపంచానికి తానే బాస్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్న  డొనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ దేశ న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రపంచ దేశాలపై సుంకాల విషయంలో ఇప్పటికే కోర్టు నుంచి వ్యతిరేక తీర్పు రాగా.. తాజాగా వలసదారుల విషయంలోనూ అదే అనుభవం ఎదురైంది. అక్రమ వలసదారులను వారికి సంబంధం లేని ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. 

అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ కార్యవర్గం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మసాచుసెట్స్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను అమెరికా నుంచి గ్వాటమాల, దక్షిణ సూడాన్, కోస్టారికా వంటి ఇతర దేశాలకు తరలించారు. 

దీంతో ఈ తరలింపు ముప్పును ఎదుర్కొంటున్న వలసదారులు కోర్టులో దావా వేశారు. ఆ దావాపై తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్ట విరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది . ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల సమయం ఇచ్చింది.