హర్మూజ్ పూర్తిగా మా అధీనంలోనే.. ట్రంప్.!
Published on: Wed Sep 2, 2026 10:21AM
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు పూర్తిగా తమ అధీనంలోనే ఉందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిపై 100 శాతం నియంత్రణ సాధించామని, జలసంధి ఇప్పుడు తమ గుప్పిట్లోనే ఉందని డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా, ఇరాన్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
ఇరాన్‌న్ ను చర్చలకు ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ వస్తున్న కథనాలను ఆయన ఖండాంచారు. అవన్నీ ఫేక్ వార్తలని పేర్కొన్న ట్రంప్.. తాను ఇరాన్‌తో చర్చల కోసం వెంపర్లాడటంలేదన్నారు. ఇరాన్ తో ఒప్పందం చేసుకున్నా,చేసుకోకపోయినా తేడా ఏం లేదన్న ట్రంప్.. ప్రస్తుత పరిస్థితులన్నీ తమకు పూర్తి అనుకూలంగా మారాయన్న ధీమా వ్యక్తం చేశారు.
ఒకవైపు హర్మూజ్ జలసంధి తమ అధీనంలోకి రావడం, మరోవైపు దాడులు, ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు. ఇరాన్ తన సొంత పతనాన్ని తానే కొనితెచ్చుకుంటోందని పేర్కొన్నారు.

ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి గంటల ముందు అమెరికా ఇరాన్ పై సైనిక చర్యకు దిగింది. మంగళవారం (సెప్టెంబర్ 1) హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ( స్థావరాలపై అమెరికా వైమానిక దాడికి పాల్పడింది. జలసంధిలో సముద్రపు మైన్‌లు అమర్చి అంతర్జాతీయ చమురు నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ చేసిన విఫలయత్నం, అలాగే జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడం వంటి చర్యలకు ప్రతికారంగానే ఈ భారీ ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. ఈ మెరుపు దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలకమైన వాయు రక్షణ వ్యవస్థలు, అధునాతన రాడార్లు, సముద్ర ఆస్తులు, మిలిటరీ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా పేర్కొంది.
[Donald Trump Announce Strait of Hormuz Under America Control, US Iran Tensions, Airstrikes, US Central Command, Telugu One]


