TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాన్ శాంతి ప్రతిపాదన: తిరస్కరించిన ట్రంప్.!

Published on: Sat Sep 26, 2026 9:31AM

అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు  మళ్లీ తారస్థాయికి చేరుకున్నాయి.  హర్మూజ్ జలసంధిలో సాధారణ నావిగేషన్‌ను పునరుద్ధరించే నిమిత్తం ఇరాన్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఏడు రోజుల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ద్వంద్వంగా రిజెక్ట్ చేశారు.

ఖతార్  ద్వారా అమెరికా పరిశీలనకు టెహ్రాన్ ప్రభుత్వం ఒక శాంతి ప్రతిపాదన, ప్రణాళిక పంపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ధృవీకరించారు.   తమ నౌకాశ్రయాలపై అమెరికా అమలు చేస్తున్న నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు, చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించాలి, అలాగే  నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను   విడుదల చేయాలి. తమ షరతులకు అంగీకరిస్తే వారం రోజుల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని, లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాలలోనూ ఘర్షణలను నిలిపివేస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. అంతేకాకుండా, దీనిపై సానుకూల స్పందన వస్తే అణు కార్యక్రమంపై విస్తృత స్థాయి చర్చలకు సిద్ధమని  ప్రకటించింది.

అయితే..  ఇరాన్ తన హామీలను అమలు చేస్తుందనే నమ్మకం లేదని ట్రంప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.  ఇరాన్‌ను అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్, ఈ దౌత్యపరమైన ప్రతిపాదనల తిరస్కరించారు. నవంబర్‌లో జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత ఇరాన్‌పై సైనిక చర్యలను తిరిగి ఉద్ధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిని తన సోషల్ మీడియా ఖాతాలో  ట్రంప్ స్ట్రెయిట్   పోస్ట్ చేశారు. ట్రంప్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్టు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

[Donald Trump, Iran Peace Proposal, Strait of Hormuz, US Iran Conflict, Middle East Tensions]