ఎఐకి ట్రంప్ కొత్త పేరు: ఏంటో తెలుసా.?
Published on: Wed Sep 23, 2026 10:57AM

కృత్రిమ మేధ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఏఐకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరు పెట్టారు. ఏఐను ఇక నుంచి ఏఐ తాను కొత్తగా నామకరణం చేసిన సూపర్ ఇంటెలిజెన్స్ గా పిలవాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు తాను ఆ సాంకేతికతకు సముచిత అర్ధాన్ని, సార్థకతనూ చేకూర్చేలా సూపర్ ఇంటెలిజెన్స్ అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రాలన్నింటిలోనూ ఇక నుంచి ఏఐ అని కాకుండా సూపర్ ఇంటెలిజెన్స్ అనే పేరు ఉపయోగించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా చర్చకూ తెరలేపింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆర్టిఫిషియల్' అనే పదం ఈ సాంకేతికత నిజమైన శక్తిని, పరిధిని తక్కువ చేసి చూపుతోందని ట్రంప్ అన్నారు. ఆర్టిఫిషియల్ అన్న పదం.. నకిలీ, ఫేక్ అన్న భావనను కలిగిస్తోందనీ, కానీ ఈ టెక్నాలజీ చాలా చాలా గొప్పదని పేర్కొన్న ట్రంప్.. అందుకే ఇక నుంచి ఏఐ అని కాకుండా సూపర్ ఇంటిలిజెన్స్ అని పిలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ దస్త్రాల్లో ఏఐ స్థానంలో సూపర్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని చేర్చడం ద్వారా ఆ సాంకేతికతకు సార్థకత చేకూరుతుందనీ, వాస్తవికతకు అద్దం పట్టినట్లౌతుందనీ ట్రంప్ వివరించారు. ఆయన వివరించారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏఐకు సూపర్ ఇంటెలిజెన్స్ అన్న పేరునే వాడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదలా ఉంటే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఈ ప్రకటన చేయడానికి ముందు డోనాల్డ్ ట్రంప్ తన సామిజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ లో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఒక్క ట్రూత్ సోషల్ లోనే కాకుండా ఎక్స్ లో కూడా ప్రజల నుంచి ఏఐకు ప్రత్యామ్నాయ పేర్లపై ఓటింగ్ కోరారు. సుపీరియర్ ఇంటెలిజెన్స్' 'ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీమ్ ఇంటెలిజెన్స్ వంటి పేర్లను పరిశీలించిన తర్వాతసూపర్ ఇంటెలిజెన్స్ వైపు మొగ్గు చూపారు. సోషల్ మీడియాలో నిర్వహించిన పోల్స్‌లో కూడా ప్రజల నుంచి ఈ పేరుకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ట్రంప్ తెలిపారు.
[Donald Trump, Artificial Intelligence, New Name, Super Intelligence, US Government, UN General Assembly, World Countries, Telugu One]


