TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈయూకు కు ట్రంప్ వార్నింగ్.. కెనడాతో కలిస్తే టాక్స్ వాతలు తప్పవంటూ హెచ్చరిక.!

Published on: Thu Sep 17, 2026 12:15PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా మిత్రదేశాల కూటమిలో ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.   కెనడా, యూరోపియన్ యూనియన్ మధ్య  వాణిజ్య ఒప్పందాలను ట్రంప్ తప్పుపట్టారు.   అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా  ఒప్పందం జరిగితే యూరప్‌పై భారీ సుంకాల వడ్డింపు తప్పదన్నారు. అంతే కాదు.. అవసరం అనుకుంటే, అనివార్యమైతే ఈయూతో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు.  

నార్త్ కరోలినాలోని షార్లెట్ విమానాశ్రయంలో  మీడియాతో మాట్లాడిన  ట్రంప్ యూరోపియన్ యూనియన్‌లో కెనడా అసోసియేట్ సభ్యదేశంగా చేరే అవకాశం ఉందని  తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అదే జరిగితే.. అమెరికా ప్రయోజనాలకు భంగం వాటిల్లితే..  దానిని అమెరికాకు వ్యతిరేకంగా   తీసుకున్న శత్రు చర్యగా భావిస్తామని హెచ్చరించారు. యూరప్  అలా అడుగువేస్తే..  భారీ టారిఫ్‌లు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.  

ఇక ఇరాన్ పై ట్రంప్ ఒకింత సానుకూలత ప్రదర్శించారు.  ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందనీ, ఇరాన్ కూడా ఒప్పందం చేసుకోవడానికి   ఆసక్తిగా ఉందనీ వెల్లడించారు. ఇరాన్ తో ఒప్పందం తుది దశకు చేరుకుందన్న ట్రంప్..  ఆ ఒప్పంద వివరాలు మాత్రం వెల్లడించలేదు. అగ్రరాజ్యాధినేత ఏకకాలంలో మిత్రపక్షానికి హెచ్చరికలు జారీ చేయడం, శత్రుదేశంపై సానుకూలత వ్యక్తం చేయడం ఆయన విదేశాంగ విధానంలోని వైరుధ్యాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. 


[Donald Trump,EU Warning,  Europe tariffs, Canada Trade Deal, US trade warning, Iran Peace Negotiations, Telugu One]