Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోజుకో మలుపు తిరుగుతున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణ వివాదం
posted on: Feb 5, 2026 1:35PM
.webp)
కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వీణ అనే మహిళ చేస్తున్న ఆరోపణలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తనే ఎమ్మెల్యేను ట్రాప్ చేశానంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను వీణ తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రచారాల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.శ్రీధర్‌ను తాను ట్రాప్ చేయాల్సిన అవసరమే లేదని మాట్లాడిన వీణ, ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తనపై కావాలనే తప్పుడు కథనాలు సృష్టించి, తన ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర జరుగుతోందని వీణ ఆరోపించారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత జీవితంపై కూడా వీణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేకు దాదాపు ఆరుగురు మహి ళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే ఆ ఆధారాలను బయట పెడతానని హెచ్చరించారు.
తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యేకు బహిరంగ సవాల్ విసిరిన వీణ, తనపై ఆరోపణలు చేసే ముందు వాటికి ఆధారాలు చూపాలి. దమ్ముంటే నిరూపించాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివా దంలో కీలకంగా మారిన రూ.25 కోట్ల డిమాండ్ అంశంపై కూడా వీణ స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వాయిస్ రికార్డింగ్ తనది కాదని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ఆడియోలను సృష్టించారని ఆరోపించారు.
అయితే.. తాను ఎమ్మెల్యేతో మాట్లాడిన కొన్ని విష యాలను స్క్రీన్ రికార్డ్ చేశానని వీణ వెల్లడించారు. ఆ రికార్డింగ్ విషయం ఎమ్మెల్యే శ్రీధర్‌కు ముందే తెలుసునని, ఆయనకు తెలియకుండా ఏ రికార్డింగ్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిజస్వరూపం త్వరలోనే బయటపడు తుందని వీణ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి నిజాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని వీణ పేర్కొన్నారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.



.webp)


