ఇంట్లో చిరుత.. నాకేం భయ్యం.. దివ్యాంగురాలి సాహసం, సమయస్ఫూర్తి.!
Published on: Fri Oct 16, 2026 10:30AM
ఇంట్లోకి కృూర మృగం ప్రవేశించినా ఇసుమంతైనా బెదరకుండా.. అనితర సాధ్యమైన తెగువ, సమయస్ఫూర్తి ప్రదర్శించిన దివ్యాంగురాలి సాహసం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. విషయమేంటంటే.. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా తల్లీ సేథీ గ్రామంలో రాత్రి సమయంలో ఓ చిరుతపులి గ్రామ సమీపంలోని అడవి నుంచి జనావాసాల్లోకి ప్రవేశించింది.
జయంతి దేవి అనే దివ్యాంగురాలైన మహిళ నివాసం ఉంటున్న ఇంట్లోకి దూరింది ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది. అయినా జయంతీ దేవి బెదరలేదు. ధైర్యం కోల్పోలేదు. శారీరక వైకల్యాన్ని కూడా లేక్క చేయకుండా ఆమె చురుకుగా కదిలారు. సమయస్ఫూర్తి ప్రదర్శించారు. చిరుత ఉన్న గది తలుపులను బయటి నుంచి మూసేసి తాళం వేశారు. దాంతో ఆ చిరుత గదిలో బందీ అయిపోయింది. క్షణాల వ్యవధిలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాలనే చిరుత గ్రామంలోని ఇతరులకు అపాయం తలపెట్టే ముప్పును కూడా తప్పించింది.

ఆ తరువాత ఆ మహిళ గ్రామస్తులను పిలిచి విషయం చెప్పింది. అటవీ అధికారులకుసమాచారం అందించింది. వారు వచ్చి గదిలో బందీగా ఉన్న ఆ చిరుతను సురక్షితంగా పట్టుకున్నారు. చిరుతను గదిలో బంధించిన జయంతీదేవిని అటవీ అధికారులు ప్రశంసించారు. నెటిజనులు ఆమె తెగువను ప్రస్తుతిస్తున్నారు. ఆమె సాహసాసికీ, సమయస్ఫూర్తికీ సెల్యూట్ చేస్తున్నారు.
[Disabled Woman Bravery,Leopard Trapped House, Uttarakhand, Betalghat Leopard Incident, Telugu One]


