నిపుణులు, హెచ్చరిస్తున్న డయాబెటిస్ తెచ్చే ,4 హానికరమైన ఆహారాలు!
Published on: Fri Nov 6, 2026 8:17AM

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో మధుమేహం లేదా డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారింది. కేవలం వృద్ధులే కాకుండా చిన్న వయసు వారు, యువకులు కూడా విపరీతంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మనం నిత్యం తీసుకునే తప్పుడూ ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి మరియు డయాబెటిస్ ముప్పును సమర్థవంతంగా నివారించడానికి కొన్ని నిర్దిష్టమైన ఆహార పదార్థాలను వెంటనే నివారించడం అత్యంత అవసరం.
మొదటిగా, మైదా మరియు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లతో తయారు చేసిన వైట్ బ్రెడ్, బిస్కెట్లు, పాస్తా, రకరకాల బేకరీ ఐటమ్స్ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. రిఫైనింగ్ ప్రక్రియలో ఈ పదార్థాలలోని పీచు పదార్థం పూర్తిగా తొలగిపోతుంది. ఫలితంగా వీటిని తిన్న వెంటనే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా అమాంతం విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి వైట్ బ్రెడ్‌కు బదులుగా తృణధాన్యాలు తీసుకోవడం ఉత్తమం.
ఇక రెండవది, కూల్ డ్రింక్స్, సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేటెడ్ జ్యూస్‌ల రూపంలో తీసుకునే చక్కెర నిండిన పానీయాలు. వీటిలో కృత్రిమ చక్కెరలు అత్యధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచి, అతి త్వరగా డయాబెటిస్ బారిన పడేలా చేస్తాయి. దాహంగా ఉన్నప్పుడు సోడాలకు బదులుగా మంచి నీరు, స్వచ్ఛమైన మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మూడవదిగా, చిప్స్, నమ్‌కీన్లు, ఇతర ప్యాకేటెడ్ జంక్ ఫుడ్‌లలో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, ప్రిజర్వేటివ్స్ నిండి ఉంటాయి. ఇవి గుండె జబ్బులతో పాటు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి. మార్కెట్లో లభించే ప్యాకేటెడ్ స్నాక్స్‌కు బదులుగా ఇంట్లో తయారు చేసిన తాజా స్నాక్స్‌ను మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/pongamia-flower-powder-35-235887.html
నాల్గవది, సాసేజ్‌లు, సలామీ, మరియు ఇతర ప్రాసెస్ చేసిన మాంస పదార్థాలు. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు శరీరంలో మంటను పెంచి మధుమేహం ముప్పును వేగంగా పెంచుతాయి.
.webp)
మధుమేహం బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రాసెస్ చేసిన, చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/black-gram-benefits-35-236368.html
https://teluguone.com/news/content/peanuts-for-brain-35-236135.html
Foods That Cause Diabetes, Expert Diabetes Warnings, High Blood Sugar Foods To Avoid, Preventing Diabetes Diet, Bad Foods For Health, Blood Sugar Control Tips, Health Tips In Telugu.


