TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆటకు గుడ్ బై: సీఎస్కే మెంటర్ గా కొత్త అవతారం.. మిస్టర్ కూల్ ప్రకటన.!

Published on: Tue Nov 17, 2026 2:38PM

భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్  ఫ్రాంచైజీకి  వెన్నెముకలా నిలిచిన   మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో ఆటగాడిగా  తన బంధాన్ని తెంచుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించిన మిస్టర్ కూల్ ధోనీ, ఐపీఎల్ కు కూడా దూరమౌతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. క్రికెటర్ గా తన కెరీర్ కు ముగింపు పలికినట్లు వెల్లడించాడు.   ఐపీఎల్ మ్యాచ్‌లలో ఇకపై తాను మైదానంలో ఆటగాడిగా బరిలోకి దిగబోనని స్పష్టంచేశాడు.   2027 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మోడీ మెంటర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు జట్లు ఫ్రాంచైజీ మంగళవారం(నవంబర్ 17)  ప్రకటించింది. 

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఐపీఎల్ టోర్నమెంట్‌లో చెన్నై జట్టుతోనే ప్రయాణం సాగించిన ధోనీ కెప్టెన్ గా సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినప్పటికీ, అభిమానుల కోసం చెన్నై పక్షాన ఐపీఎల్‌లో ఆడుతూ వచ్చాడు. అయితే గత కొంతకాలంగా మోకాలి గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతుండటంతో పాటు వయసురీత్యా ఆయన తన ఆటను పరిమితం చేసుకుంటూ వచ్చాడు. 

ఈ నేపథ్యంలో 2026 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా ఉన్నప్పటికీ టోర్నీ మొత్తం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక 2027 ఐపీఎల్ టోర్నీకి ఆటగాడి జెర్సీని పక్కన పెట్టి, డగ్ అవుట్ నుంచి యువ ఆటగాళ్లను నడిపించే సరికొత్త బాధ్యతను ధొనీ స్వీకరించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం,  సహ యజమానులు ధోని జట్టుకు దూరం అవ్వాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. సీఎస్కే లేకుండా ధోని లేరు, ధోని లేకుండా సీఎస్కే లేదు అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా సీఎస్కే విజయాలు,  అపజయాలు, ఇలా ప్రతి  క్షణం ధోనీ, సీఎస్కే కలిసి పయనించాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు  జట్టు పరివర్తన దశలో ధోని అనుభవం, మార్గదర్శకత్వం సీఎస్కేకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.  ధోనీ ఇప్పటికీ సీఎస్కే జట్టు భాగస్వామేననీ, భవిష్యత్తులోనూ భాగస్వామిగా కొనసాగుతారని వారా ప్రకటనలో స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: IPL 2027 రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ.!​

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఒకరిగా, అలాగే అత్యుత్తమ ఫినిషర్‌గా, వ్యూహకర్తగా ధోని సాధించిన విజయాలు రికార్డులూ అసాధారణం. దోనీ నాయకత్వంలో సీఎస్‌కే జట్టు ఎన్నో చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది.   2027 ఐపీఎల్ సీజన్ కోసం యువ జట్టును సమాయత్తం చేయడంలో, వారికి ఒత్తిడిని జయించే మెళకువలు నేర్పించడంలో ధోని సలహాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

మైదానంలో తనదైన శైలిలో హెలికాప్టర్ షాట్లు కొడుతూ, మెరుపు వేగంతో స్టంపింగ్‌లు చేస్తూ కోట్లాది మంది అభిమానులను అలరించిన ‘థాలా’ ధోని ఇకపై మైదానంలో కనిపించకపోయినా, మెంటర్ పాత్రలో చెన్నై జట్టు వెంటే ఉండనున్నారు. పసుపు రంగు జెర్సీలో ఆయన కొత్త ప్రయాణం ప్రారంభం కానుండటంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. 2027 ఐపీఎల్ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో కొత్త అవతారంలో కనిపించనున్న ధోనిని స్వాగతించడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:  ఐపీఎల్‌లో ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ... మహీ శకం ముగిసినట్లేనా?​


ఐపీఎల్‌లో ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ... మహీ శకం ముగిసినట్లేనా?

 

[Dhoni, IPLretirement, CSK mentor, Twodecaes, Attachment,TeluguOne]