తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం: సర్వదర్శనానికి ఎన్నిగంటల సమయం అంటే.!
Published on: Wed Oct 21, 2026 9:46AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (అక్టోబర్ 21) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి వెడుతున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 20) ఒక్కరోజే మొత్తం 83,745 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 19 వేల 391 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 99 లక్షల రూపాయలు వచ్చింది.
[Devotees Rush Noral Tirumala, Sarvadarshanam, Six Hours, Tirumala Tirupati Devasthanams,Hundi Income, Telugu One]


