తిరుమలలో పెరిగిన శ్రీవారి భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (సెప్టెంబర్ 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.

ఇక గురువారం  (సెప్టెంబర్ 20) శ్రీవారిని 66వేల 462 మంది దర్శించుకున్నారు. వారిలో 29వేల 241 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 77లక్షల రూపాయలు వచ్చింది.