కొండా సురేఖ ఔట్.?
Published on: Sat Aug 22, 2026 2:49PM

తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి, మంత్రి కొండా సురేఖను పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ప్రభుత్వ విప్ వేముల వీరేషం తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం.. క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు. 2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.
Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet


