TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం: ఎనిమిది మంది దుర్మరణం.!

Published on: Sat Oct 17, 2026 4:31PM

దిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం (అక్టోబర్ 17) జరిగిన ఘోర ప్రమాదంలో  ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.  మరో అరడజను మంతి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రయాణికులతో   వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న   నాళాలోకి దూసుకెళ్లి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్, బైతుల్ జిల్లాలకు చెందిన భక్తులు రాజస్థాన్‌లోని ణ్యక్షేత్రమైన ఖాతూశ్యామ్‌జీ దర్శనానికి వాహనంలో  వెడుతుండగా  కోటా జిల్లా సిమలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరాడియా టోల్ ప్లాజా సమీపంలో  ఈ ప్రమాదం సంభవించింది. వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వంతెన పైనుంచి దాదాపు 15 అడుగుల లోతున్న  నాళాలో పడిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే సి పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న వాహనం నుంచి బాధితులను బయటకు తీసేందుకు ప్రత్యేక క్రేన్లను రంగంలోకి దించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అత వేగం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం ప్రమాదానికి కారణాలుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 


[Delhi Mumbai Expressway Accident, Kota Accident,  Rajasthan, Eight Dead, Six Injured, Telugu One]