హస్తినలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు.!
Published on: Fri Sep 18, 2026 2:14PM

దేశ రాజధాని హస్తినలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పదిహేడేళ్ల వయసున్న బాలికపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు, జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ లోగా ఆ బాలిక మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి.
కుషక్ రోడ్ సమీపంలోని ఖాళీ పొలాలలో పడి ఉందన్న సమాచారం పోలీసులకు ఈ నెల 13న అందింది. ఈ క్రమంలో కేసును సీరియస్‌గా తీసుకున్న దర్యాప్తు బృందాలు ఆ ప్రాంతంలోని యాభైకి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఆ సమయంలో అనుమానాస్పద రీతిలో ఒక టెంపో వాహనం సంచరించినట్లు గుర్తించారు. ఆ టెంపో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. టెంపో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ముగ్గురు 16, 17 ఏళ్ల మైనర్లు కావడం గమనార్హం.
.webp)
నిందితులకు బాధితురాలైన బాలికకు ముందే పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారంతా కలిసి ఒక టెంపోలో కూర్చుని మద్యం సేవించిన అనంతరం, ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత ఆమెపై కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించారని భావిస్తున్న రెండు కత్తులతో పాటు, నిందితులు ఆ సమయంలో ధరించిన రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
[Delhi Gang Rape, Minor Girl Murder, POCSO Act Delhi, Four Arrest, Telugu One]


