ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. జలమయం.!
Published on: Sat Sep 5, 2026 11:08AM

భారతదేశ రాజధాని ఢిల్లీలో సామాజిక మౌలిక సదుపాయాల లోపం మరోసారి ప్రస్ఫుటంగా బయటపడింది. ఢిల్లీలోని గాలి నాణ్యత సూచిక, ట్రాఫిక్ పరిస్థితి అత్యంత దారుణం అన్న సంగతి తెలిసింది. తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమై విమర్శలకుగురైంది. శుక్రవారం హస్తినలో కురిసిన భారీ వర్షానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైంది.

ముఖ్యంగా టెర్మినల్ 2, 3 అప్రోచ్ రోడ్లు, ఫోర్‌కోర్ట్‌లలో భారీగా నీరు నిలిచింది. సాధారణంగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉత్తమ నాణ్యతతో ఉంటాయని అంతా భావిస్తారు.. కానీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నాణ్యత విషయంలో అద్వానంగా ఉందని తాజా ఘటన చాటింది. విమానాశ్రయం జలమయమవ్వడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శని, ఆదివారాలలో కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.
[Delhi Airport Water logged, , Indira Gandhi International Airport, Delhi rains, airport waterlogging, Delhi news, Telugu One]


