TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైసూర్ మసాలా దోశలో చచ్చిన ఎలుక: మంబైలో ప్రముఖ హటల్ లైసెన్సు రద్దు.!

Published on: Wed Sep 30, 2026 9:25AM

ముంబై  హోటళ్లలో పారిశుద్ధ్య లోపం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. తాజాగా ముంబై హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత మరో సారి చర్చనీయాంశంగా మారింది.   ఓ రెస్టారెంట్‌లో కస్టమర్  ఆర్డర్ చేసిన మైసూర్ మసాలా దోసెలో ఏకంగా చచ్చిన ఎలుక ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. ఆహారంలో ప్రాణాపాయకరమైన వస్తువులు రావడం పట్ల నగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ షాకింగ్ ఘటన ముంబైలోని బోరివలి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ప్రముఖలో చోటుచేసుకుంది.  స్థానికంగా మంచి పేరున్న ఈ రెస్టారెంట్‌కు వచ్చిన ఓ కస్టమర్ తన సోదరుడితో కలిసి మైసూర్ మసాలా దోసెను ఆర్డర్ చేశారు. అయితే..  సర్వే చేసిన మైసూర్ దోసెలో చచ్చిన ఎలక ఉండటాన్ని గుర్తించిన కస్టమర్ ఆవేదన వ్యక్తం చేసుకున్నాడు.. వెంటనే  వారు ఈ వ్యవహారంపై స్థానిక బోరివలి పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే   ఆ కేసును ఆహార,  ఔషధ నియంత్రణ సంస్థ కు   ఈ ఘటనపై స్పందించిన ఎఫ్‌డీఏ తక్షణ చర్యలు చేపట్టింది.  బాధితుల ఫిర్యాదు మేరకు నిబంధనలను ఉల్లంఘించిన హోటల్ లైసెన్స్‌ను  సస్పెండ్ చేసింది. 

ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా పండుగ సీజన్ కొనసాగుతుండటంతో, ఎఫ్‌డీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పలు హోటళ్లు, రెస్టారెంట్లపై  ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతంతో అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

నిత్యం వందలాది మంది ఫ్యామిలీలతో కలిసి వచ్చే ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఇలాంటి దారుణాలు జరగడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లలో వంటశాలల నిర్వహణ, పరిశుభ్రతపై ఆహార భద్రతా శాఖ మరింత నిఘా పెట్టాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  

[Dead Rat in Dosa,  Mumbai Hotel, FDA License Suspension, Borivali West, Mumbay Hotel. Customer, Complaint, Food Safety, Maharashtra, Telugu One]