ఉద్యోగులే హ్యాకర్లుగా మారితే? డార్క్ వెబ్‌లో కంపెనీ రహస్యాల వేలం!
Published on: Thu Aug 27, 2026 10:53AM
.webp)
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు నిమిషానికో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఇప్పటివరకు హ్యాకర్లు బాహ్య వ్యవస్థల నుండి కంపెనీల డేటాను దొంగిలించడం లేదా సిస్టమ్‌లను హ్యాక్ చేయడం చూశాం. కానీ ఇప్పుడు ఒక దిగ్భ్రాంతికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. కంపెనీల డిజిటల్ భద్రతకు అసలైన ముప్పు బయటి వ్యక్తుల నుంచి కాకుండా, సంస్థల్లో పనిచేస్తున్న సొంత ఉద్యోగుల నుంచే వస్తోందని సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ 'ఫ్లాష్‌పాయింట్' (Flashpoint) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్ళు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ వాల్స్‌ను బద్దలు కొట్టడానికి బదులుగా, డబ్బు ఆశచూపి ఉద్యోగుల ద్వారా కంపెనీలోకి ప్రవేశిస్తున్నారు. మరికొందరు ఉద్యోగులు కంపెనీపై ఉన్న కోపంతో లేదా అదనపు ఆదాయం కోసం తమకు ఉన్న పాస్‌వర్డ్‌లను, సిస్టమ్ యాక్సెస్‌ను ఆన్‌లైన్ లోపలి చీకటి ప్రపంచమైన 'డార్క్ వెబ్' (Dark Web) లో వేలం పెడుతున్నారు.
ఫ్లాష్‌పాయింట్ నిర్వహించిన సమగ్ర అధ్యయనం ప్రకారం, జులై 2025 నుండి జులై 2026 మధ్య కాలంలో డార్క్ వెబ్‌లో రోజూ సగటున 34 ఇన్సైడర్ థ్రెట్ (Insider Threat) పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అంటే ప్రతినెల దాదాపు 1,000 ప్రత్యేకమైన డార్క్ వెబ్ యాక్సెస్ ప్రకటనలు నమోదయ్యాయి. కేవలం జులై 2026 ఒక్క నెలలోనే విశ్లేషకులు ఏకంగా 12,653 ఇన్సైడర్ సంబంధిత పోస్టులను గుర్తించారు. అందులో 1,132 నిశ్చయమైన యూనిక్ పోస్టులు కాగా, డార్క్ వెబ్‌లో జరిగిన సంభాషణలు మరియు యాక్సెస్ విక్రయాలలో 75 శాతానికి పైగా పోస్టులు నేరుగా కంపెనీ ఉద్యోగులే తమ సిస్టమ్ యాక్సెస్‌ను విక్రయించడానికి పెట్టినవే కావడం గమనార్హం. కేవలం 25 శాతం పోస్టులు మాత్రమే నేరగాళ్ళు ఉద్యోగులను అభ్యర్థించినవి. దీనిబట్టి ఉద్యోగులు ఎంత తీవ్రమైన స్థాయిలో కార్పొరేట్ డేటాను విక్రయించడానికి స్వయంగా ముందుకు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
employees selling company access dark web,flashpoint cyber security insider threat study.


