దానం నాగేందర్ పై అనర్హత వేటు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.!
Published on: Fri Sep 18, 2026 4:38PM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన దానం నాగేందర్.. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 17) తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పిర్టీ ఫియాయింపుల చట్టం ప్రకారం చర్య తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
[Danam Nagender, High Court verdict, MLA disqualification, Khairatabad MLA, defection case, Telangana news, Telugu One]


