TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రప్రదేశ్ లో విలయం సృష్టించిన అర్నాబ్.. ఉప్పాడలో 30 నివాసాలు నేలమట్టం.!

Published on: Wed Oct 28, 2026 3:10PM

జల విలయం, వాయు విధ్వంసం సృష్టించిన అర్నాబ్ ఏపీలో సృష్టించిన అల్లకల్లోలం, ఆస్తినష్టం వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ఉదయం నర్సాపురం, యానాం మధ్య తీరాన్ని దాటిన ఈ అతి తీవ్ర తుపాను క్రమంగా బలహీనపడుతున్నా.. కుండపోత, కుంభవృష్టి వర్షాల ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అదలా ఉండగా   అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  

అర్నాబ్   ఉధృతి కారణంగా ఉప్పాడతో పాటు పరిసర తీర ప్రాంత గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. సుబ్బంపేట, సూరడపేట, జగ్గరాజుపేట, పల్లిపేట, రంగంపేట మరియు మాయాపట్నం  గ్రామాల్లోకి సముద్రపు నీరు పెద్ద ఎత్తున చొచ్చుకొచ్చింది. సముద్రం ఉప్పొంగి  తీరానికి ఆనుకుని ఉన్న దాదాపు 30 నివాసాలను నేలమట్టం చేసింది.  ఇక  దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన పెనుగాలుల ఉధృతికి  మరికొన్ని ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. 

 తీరప్రాంత రక్షణ కోసం ఏర్పాటు చేసిన భారీ నిర్మాణాలు సైతం కుప్పకూలాయి. సుబ్బంపేట సమీపంలో సముద్ర  కోతను నివారించడానికి నిర్మించిన పటిష్టమైన రక్షణ గోడ  ధ్వంసమైంది. అలల తీవ్రతకు గోడ రక్షణగా ఉంచిన భారీ బండరాళ్లు కూడా  కొట్టుకుపోయాయి.  

[Cyclone Arnab Uppada Coast, Kakinada Beach Road Damaged, Arnab Storm Impact AP, Uppada Sea Erosion, 30 Houses collapse, TeluguOne]