అర్నబ్ ఎఫెక్ట్: కోనసీమ కకావికలు..125 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు.!
Published on: Wed Oct 28, 2026 9:15AM
.webp)
అర్నబ్ తుపాను కోనసీమ జిల్లాను కకావికలం చేసింది. పెను తుపాను ప్రభావంతో గంటకు నూటపాతిక కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల వేగం తీవ్రత గంటకు150 కిలోమీటర్ల వరకూ ఉంది. ఈ ప్రచండ గాలులకు జిల్లాలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ గాలుల ధాటికి వేల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, అయినవిల్లి, మామిడికుదురు ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం సహా పలు మండలాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షపాతం నమోదైంది. ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి.
.webp)
కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరువేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంచుమించుగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. విరిగిపడిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అలాగే రహదారులకు అడ్డంగా పడిపోయిన చెట్లు తొలగించి రవాణా పునరుద్ధరించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
[Cyclone Arnab Effect On Konaseema District, Damage, Amalapuram, Ambajipet, Traffic, Power, Trees, Current, Poles, Telugu One]


