TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నాబ్ ఎఫెక్ట్: ఇప్పటికీ తేరుకోని ఉత్తరాంధ్ర జిల్లాలు..పొంగిపొర్లుతున్న ప్రధాన నదులు.!

Published on: Fri Oct 30, 2026 10:10AM

అర్నాబ్ తుపాను తీరం దాటి రెండు రోజులు గడిచినా ఉత్తరాంధ్రలో పరిస్థితులు కుదుటపడలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు  పొరుగురాష్ట్రం ఒడిశాలో కుండపోత వానలు తోడై.. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

  శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.  బాహుదా నది  పోటెత్తింది. దీంతో గురువారం (అక్టోబర్ 20) ఒక్కరోజే ఈ నదికి సుమారు 86 వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం రావడంతో, ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో  వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అలాగే జగన్నాథపురం, ధర్మవరం, తోటవూరు   ప్రాంతాలు  నీట మునిగాయి.  

 ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ వరద తీవ్రత మహోధృతంగా ఉంది. సువర్ణముఖి, నాగావళి, వేగావతి నదులు పొంగి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వంగర మండలం కొప్పర, కొండచాకరాపల్లి, రేగిడి, సంతకవిటి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. సోంపేట, బారువ ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా వరద చేరి, పొలాలు జలమయమయ్యాయి. బారువ తీర ప్రాంతంలో కోత కారణంగా కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోనే వేల హెక్టార్లలో వరి , ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

ఇక పోతే, ఇచ్ఛాపురం, జాడిపూడి మధ్య రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలను  నిలిపివేశారు. అలాగే, ప్రముఖ  అరకు వైపు వెళ్లే మార్గాలు కూడా మూతపడ్డాయి. అరకు-విశాఖపట్నం ఘాట్‌ రోడ్డులో గాలికొండ వద్ద రోడ్డు కుంగిపోవడంతో వాహనాల   నిలిపివేశారు. కొత్తవలస కిరండూల్‌ రైల్వే మార్గంలోనూ ట్రాక్‌ దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేశారు.  


[Cyclone Arnab Effect, North Andhra  floods,  Vamsadhara,  Nagavali Rivers,   Srikakulam,Vijayanagaram, Parvatipurammanyam, Villages,   Bahuda River, Over Flow, Telugu One]