TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అర్నాబ్ ఎఫెక్ట్: 53 రైళ్లు రద్దు.!

Published on: Tue Oct 27, 2026 10:32AM

ఏపీ వైపు  పెను తుపాను అర్నాబ్ దూసుకొస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది.  తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించాల్సిన మొత్తం 53 రైళ్ల  రద్దు చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ రైళ్ల   రద్దు నిర్ణయం తీసుకుంది.  విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ  చెన్నై వైపు వెళ్లే ప్రధాన మార్గాలలో రైళ్లను రద్దు చేసింది. 

రద్దయిన రైళ్ల జాబితాలో ఎక్స్‌ప్రెస్ , ప్యాసింజర్ సర్వీసులు   ఉన్నాయి. అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడంతో స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణం రద్దయిన వారికి నిబంధనల ప్రకారం పూర్తి టికెట్ సొమ్మును తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు మొబైల్ ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. ఎవరైనా ప్రయాణికులు స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ రైలు నంబర్‌కు సంబంధించిన తాజా స్థితిని ఆన్‌లైన్ పోర్టల్స్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా ధృవీకరించుకోవాలని కోరింది. స్టేషన్లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, వారికి కావలసిన వసతి మరియు ఆహార ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. తుఫాన్ గమనాన్ని బట్టి మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు లేదా పాక్షిక రద్దు ఉండే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.  


[Cyclone Arnab Effect, AP Trains Cancelled, South Coast Railway, Arnab Cyclone, 53 Trains Vancelled, TeluguOne]