TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీరం దాటిన అర్నాబ్: అయినా తప్పని ముప్పు.. మరో 24 గంటలు అప్రమత్తత అనివార్యం.!

Published on: Wed Oct 28, 2026 11:07AM

ఆంధ్రప్రదేశ్ భయపెట్టి, చిగురుటాకులా వణికించిన అర్నాబ్ తుపాన్ తీరం దాటింది. ఈ ఉదయం పది గంటల ప్రాంతంలో అర్నాబ్ తీవ్ర తుపాను నరసాపురం, యానం మధ్య తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటుతున్న సమయంలో భారీ వర్షాలకు తోడు గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీచాయి.  ఈ  గాలుల తీవ్రతకు తీర ప్రాంతాల్లోని వృక్షాలు,విద్యుత్ స్తంభాలు పెద్ద సంఖ్యలో నేలకూలాయి. ఇక గాలుల తీవ్రతకు ఎగసిపడిన రాకాసి అలలు మత్స్యకారుల నివాసాలను ముంచెత్తాయి. 

తీరం దాటిన తర్వాత అర్నాబ్   బలహీనపడినా దాని ప్రభావం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రం మరో 24 గంటల పాటు కొనసాగు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కొనసాగుతాయనీ, ఈ కారణంగా మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందనీ, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగే ప్రమాదం పొంచి ఉందనీ హెచ్చరించింది. 

ఈ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి  పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయి.  


[Cyclone Arnab, Land Fall Yanam Narasapuram Coast,   Heavy Rains, Arnab Storm, Wild Winds, Effect, Another 24 Hours, TeluguOne]