TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

1980s ట్రెండ్‌పై సైబర్ కేటుగాళ్ల కన్ను..!

Published on: Thu Sep 10, 2026 5:40PM

1980s ట్రెండ్‌పై సైబర్ కేటుగాళ్ల కన్ను పడింది.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన 80s AI ఫోటో ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్స్‌ను టార్గెట్ చేస్తూ.. 1980 పేరుతో నకిలీ యాప్‌లు, ఫేక్ లింకులు, APK ఫైల్స్‌ను వైరల్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం 80sTrend, 1980s AI Photo Trend పేరుతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణ ఫొటోను 1980ల నాటి స్టైల్‌లోకి మార్చేందుకు AI టూల్స్‌ను ఉపయోగిస్తు న్నారు. 

పాతకాలపు దుస్తులు, హెయిర్‌స్టైల్, బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్, ఫిల్మ్ గ్రెయిన్ వంటి ఎఫెక్ట్స్‌తో ఫొటోలను రూపొందిం చుకుంటున్నారు. సాధారణ నెటిజన్స్ నుంచి సెలబ్రిటీలు, రాజకీయు నాయకుల వరకు ఈ ట్రెండ్‌లో భాగమవుతు న్నారు. దీంతో సోషల్ మీడియాలో 1980s స్టైల్ ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ‘1980 Photo Editor’, ‘80s AI Photo’, ‘1980s Retro App’ వంటి పేర్లతో నకిలీ యాప్‌లను రూపొందించి సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా APK ఫైల్స్ పంపించే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండ్‌లో ఉన్న ఫొటోలను చూపిస్తూ.. ‘ఈ యాప్‌తో మీ ఫొటోను 1980ల నాటి ఫొటోగా మార్చుకోండి’ అంటూ లింకులు పంపిస్తున్నారు. ఆసక్తితో ఆ లింక్‌ను క్లిక్ చేసే నెటిజన్స్.. తెలియని యాప్‌లను తమ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. తెలియని APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఫైల్స్, కాంటాక్ట్స్ వంటి డేటాకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. యాప్ కోరే అనుమ తులను పరిశీలించకుండా యాక్సెస్ ఇస్తే మరింత ముప్పు ఉండొచ్చు. మరోవైపు.. నకిలీ యాప్‌ల ద్వారా ఫొటోలు సేకరించి వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలు, ముఖానికి సంబంధించిన డేటా భవిష్యత్తులో డీప్‌ఫేక్‌లు, గుర్తింపు దుర్వినియోగం వంటి మోసాలకు ఉపయోగపడే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

80s ఫొటో ట్రెండ్ కోసం చాలామంది ChatGPT వంటి AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఉచిత వినియోగంలో ఉండే పరిమితులు, ఇమేజ్ జనరేషన్‌కు సంబంధించిన లిమిట్స్ లేదా కోరుకున్న విధంగా ఫొటో రాకపోవడంతో కొందరు నెటిజన్స్ ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం వెతుకుతున్నారు.ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. ‘ChatGPTలో లిమిట్ అయిందా? ఈ యాప్‌తో 1980 ఫొటోను వెంటనే తయారు చేసుకోండి’ అంటూ నకిలీ యాప్‌లను ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్, అనుమానాస్పద లింకులు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ‘1980s’ పేరున్న యాప్ నకిలీదని చెప్పలేం. అధికారిక యాప్ స్టోర్, యాప్ డెవలపర్ వివరాలు, రివ్యూలు, డౌన్‌లోడ్ సంఖ్య, యాప్ కోరుతున్న Permissions వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఏదైనా యాప్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే APK ఫైల్స్‌ను నేరుగా ఇన్‌స్టాల్ చేయవద్దని సూచిస్తున్నారు. వైరల్ ట్రెండ్‌లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. నెటిజన్స్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.1980 పేరుతో వచ్చే అనుమానాస్పద యాప్‌లు, APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ట్రెండ్ కోసం తొందరపడి తెలియని యాప్‌లకు ఫొటోలు అప్లోడ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం చేయకూడదని చెబుతున్నారు. వైరల్ ట్రెండ్ కంటే ముందు మొబైల్ సెక్యూరిటీ.. వ్యక్తిగత డేటా రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. 

 

 

[ Cybercriminals eye 1980s trend, Social media, APK files, WhatsApp, Telegram, SMS, ChatGPT, 
AI Tools, Retro App, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]