సామాజిక‌దూరం పాటించ‌మంటూ సి.ఆర్‌.పి.ఎఫ్‌. వీడియో!

క‌రోనా డెడ్లీ వైర‌స్‌పై సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ సందేశాత్మ‌క వీడియో రూపొందించింది. సామాన్య ప్ర‌జ‌ల్ని కూడా ఆక‌ట్టుకునేలా ఈ వీడియో వుంది. 

దేశానికి శ‌క్తి అయిన సిఆర్‌పిఎఫ్  ఈ సందేశాన్ని వినిపిస్తోందంటూ సి.ఆర్‌.పి.ఎఫ్‌.జ‌వాన్లు త‌మ‌దైన స్టైల్‌లో బ్యాండ్ వాయిస్తూ హిందీలో పాడిన వీడియో సాంగ్ సందేశంతో పాటు  స్పూర్తినిస్తోంది.

సామాజిక దూరం పాటించ‌డం క‌రోనాను ఓడించాల్సి వుంది,
చేతుల‌ను స‌బ్బుతో మ‌ళ్లీ మ‌ళ్లీ క‌డుగుతూ వుండండి, లేదా శానిటైజ‌ర్‌తో తుడుస్తూ వుండండి. 
షేక్‌హ్యాండ్ ఎవ్వ‌రికీ ఇవ్వ‌వ‌ద్దు. చేతులు జోడించి న‌మ‌స్కారం పెట్టండి అప్ప‌డే మీరు క‌రానా కాటుకు గురికారు. 
దేశ ప్ర‌జ‌ల‌కు సిఆర్‌పి ఎఫ్ ఇచ్చే సందేశం ఇదే.
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తూ, మాన‌వాళిని భ‌యంకంపితుల్ని చేస్తున్న‌ ఈ వైర‌స్‌ను ఎలా నిర్మూలించాలో ఆలోచించండి.

ప్ర‌ధాన మంత్రి చెప్పిన‌ట్లు లాక్‌డౌన్ సంద‌ర్భంగా 21 రోజుల పాటు ప్ర‌తిఒక్క‌రూ ఇంట్లోనే వుండిండి. ఈ నియ‌మం పాటించ‌డంలోనే విజ్ఞ‌తతో పాటు మీ భ‌ద్ర‌త వుంది. 

ఇంట్లోనే వుంటే సుర‌క్షితంగా ఉంటారు. లేక పోతే ప్ర‌మాదంలో ప‌డ‌తారు. ముందు వ‌రుస‌లో వుండి క‌రోనాతో పోరాడుతున్న డాక్ట‌ర్లు, పోలీసుల‌కు ప్ర‌ణామాలంటూ సి.ఆర్‌.పి.ఎఫ్‌. పాట కొన‌సాగుతోంది.