సీపీఎం సీనియర్ నేత గఫూర్ కుమారుడి మృతి: అమెరికాలో గుండెపోటుతో కన్నేమూత.. ఆలస్యంగా వెలుగులోకి.!
Published on: Sun Oct 11, 2026 9:31AM

సీపీఎం సీనియర్ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ. గఫూర్ ఏకైక కుమారుడు కిరణ్ కన్నుమూశారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో పీవీ కిరణ్ ప్రముఖ పేపాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్టుగా ఉన్నత ఉద్యోగం నిర్వర్తిస్తున్న కిరణ్ ఒంటరిగా జీవిస్తున్నారు.
ఆయన చెన్నైలోని ఐఐటీలో ఎం.టెక్ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. వృత్తిరీత్యా శాన్‌జోస్‌లో ఒంటరిగా నివసిస్తున్న ఆయనకు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి రికార్డులలో గుర్తుతెలియని మృతదేహంగా నమోదు చేసుుకున్నారు.

విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. కిరణ్ కొద్దిరోజులుగా ఆయన ఆఫీసుకు హాజరుకాకపోవడం, ఫోన్ కాల్స్‌కూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగులు ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిరణ్ మృతదేహాన్ని మార్చురీలో పరిశీలించిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశారు. వీడియో కాల్ ద్వారా భౌతికకాయాన్ని చూసిన తండ్రి గఫూర్ తన కుమారుడిని గుర్తుపట్టారు. తానా, ఇతర ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధుల సహాయ సహకారాలతో కిరణ్ భౌతికకాయాన్ని త్వరలోనే న కర్నూలుకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
[CPM Senior Leader Ghafoor Only Son Kiran Nomore, PV Kiran Dead, USA, Telugu One]


