దేశంలో కరోనా డేంజర్ బెల్స్ ! రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్  

కోవిడ్ వైరంట్  N44OK తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది  ఇప్పటికే  పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ ఘడ్,

మధ్య ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలో రోజురోజుకు  సెకండ్ వేవ్ చూపిస్తుందని అనుమానం కలుగు తోంది. అయితే రెండవ దశ కోవిడ్ కు  N44OK సిసిఎంబి శాస్త్రవేత్తలు  చేసిన పరిశోధనలో   N44OK  వైరస్ వేరియంట్ గా గుర్తించారు. కోవిడ్ వైరంట్ 1 9 దక్షిణాదిలో శర వేగంగా విస్తరిస్తోందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరంట్ రూపాంతరం చెందుతోందని దీనిని పూర్తిగా అధ్యయనం చేయడానికి క్షుణ్ణంగా  గమనించాలని శాస్త్రజ్ఞులకు సూచించారు. దీని ప్రభాల్యం తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని  రాకేశ్ తెలిపారు.  

కోవిడ్ 1 9 రెండవ దశ తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది అని  కేంద్ర నివేదికలు చెపుతున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , కేరళ, చతీస్ ఘడ్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రరూపం చూపుతోందని కేంద్ర కుటుంబ సంక్షేమం ఆరోగ్య శాఖ  ఒక నివేదికలో వెల్లడించింది. 17 రోజుల తరువాత దేశంలో మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. నవంబర్ నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి. సోమవారం మళ్లీ కేసులు పెరిగిపోయాయి.  వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి.

మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కల్గిస్తోంది. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది..

1)  ఆర్టీపిసిఆర్ పరీక్షల  సంఖ్య పెంచాలి.                                                             
 2) నెగెటివ్ ర్యాపిడ్ అంటిజన్ పరీక్షలు తప్పని సరిగా చేయాలి                            
 3) ఆర్టీపీసీఆర్ ద్వారా నెగెటివ్ వ్యక్తులు మిస్ కారాదు                                                        
4) ఎంపిక చేసిన జిల్లాలలో కన్ టైన్ మెంట్  జోన్లు ఏర్పాటు                                                             
5) జీనోమ్ సీక్వెన్స్ ప్రకారం క్లస్టర్ల నిర్వహణ 

అయితే గతం కంటే ఇప్పుడు  అపార్ట్ మెంట్లులలో కోవిడ్ విస్తరిస్తోందని  అవసరమైతే ఆ అపార్ట్ మెంట్ ను సైతం సీజ్ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటికే ప్రకటించింది.