మనీలాండ్రిరగ్‌ కింద జగన్‌కు శిక్ష పడితే?

Countrywide Big Crime, Money Laundaring, YSRCP President Jagan Mohan Reddy, If Jagan Sentenced, Attachment Of Properties, Enforcement Department, CBI Strengthening Case, Fear In YSRCP Leaders, Vijayamma, Sharmila, Jagan Wife Bharati,

 

దేశంలోనే అతిపెద్ద నేరమైన మనీలాండ్రిరగ్‌ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి శిక్ష పడితే? ఈ ప్రశ్న తాము వినలేమంటున్నారు వైకాపా నేతలు, కార్యకర్తలు. ఇప్పటికే జగన్‌ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ ఇంకా పట్టుబిగించి సిబిఐ ద్వారా జగన్‌ నేరాలను రుజువు చేసి దేశప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు తనకున్న అవకాశాలను వినియోగించుకోనుంది. దీని వల్ల భవిష్యత్తు ఏమిటో ఆ పార్టీ నేతలకే అర్ధం కావటం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే వరుస నిరసనలు, కార్యక్రమాలు చేసేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు వయస్సు అడ్డంకిగా ఉంది. ఈ వయస్సులో ఏదైనా అనారోగ్యం వస్తే అన్న భయంతోనే ఆమె కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇక ఆ పార్టీలోనే ఉన్న జగన్‌ సోదరి షర్మిల, జగన్‌ భార్య భారతి గురించి ఒకసారి ఆలోచిస్తే...షర్మిల కార్యక్రమాలు భుజాన్న మోసేందుకు సిద్ధంగానే ఉంది. కానీ, తన సోదరుడు జగన్‌ విడుదలవుతాడన్న నమ్మకంతోనే ఆమె కాలక్షేపంగా కార్యక్రమాలు సాగిస్తోంది. ఒకచోట మగ్గం నేసి మరోచోట కూలీలతో కలిసిపోయిన షర్మిల తాను తాత్కాలికం అన్న భావనను ముందుగానే ప్రతిబింబింప జేస్తోంది. జగన్‌ భార్య భారతి అయితే పూర్తిగా వ్యాపారాల్లోనే మునిగిపోయింది. తనకు పార్టీ కార్యక్రమాలకు అంతంతమాత్రమే అన్నట్లు ఆమె వ్యవహరిస్తోంది. ఈ దశలో జగన్‌ కనుక దోషి అయి శిక్ష అనుభవిస్తే పార్టీని ముందుకు నడపాల్సింది ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మాత్రమే. ఆ కమిటీలో ఉన్న అందరికీ  ముక్కు మీద కోపం. కమిటీలో మైసూరారెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితర పెద్దతలకాయలు ఉన్నా జగన్‌ ఇక రాడని తెలిస్తే వారి భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా ఉండరనేది జగమెరిగిన సత్యం.