TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిందువులను కొట్టు- అన్యులకు పెట్టు!.. ఇదేనా జగనన్న రీతి!

Published on: Tue Feb 22, 2022 6:11PM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రతి హిందువు కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు . భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్ప తరువుగా ఆరాధిస్తారు. వెంకన్న దేవుడు అంటే, హిందువుల ఇలవేలుపు. ఇది కోట్లాది మంది హిందువుల విశ్వాసం. అందుకే ఎక్కడెక్కడినుంచో భక్తులు, స్వామి వారి దర్శనానికి తరలి వస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు.

అయితే,భగవంతుని భక్తులకు అనుసంధానంగా,నిలిచి హిందూ ధర్మాన్ని నిలబెట్ట వలసిన, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి అందుకు విరుద్ధంగా వ్యహరిస్తోందనే విమర్శల వస్తున్నాయి. టీటీడీ పాలక మండలి స్వామి వారి సేవలో కంటే శ్రీ సర్కార్ వారి సేవలో పునీతమవుతోంది. తిరుమల వెంకన్నను ఒక వ్యాపార వస్తువుగా, తిరుమల కొండను వ్యాపార కేంద్రంగా చూస్తోంది. అంతే కాదు టీటీడీ ఉన్నదే భక్తులను దోచుకుని, సర్కార్ ‘ప్రభువు’ లకు సమర్పించేందుకు, హుండీలను ఖాళీచేసి సర్కార్ ఖజాననాను నింపేందుకు   అన్నట్లుగా అడుగడుగునా భక్తులను దోచుకుంటున్నారు. భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకుంటున్నారు. దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇదీ ఆడని కాదు, కాదేదీ కత్తెరకు అనర్హం, అన్నట్లుగా, ప్రతి రెండుమూడు నెలకు ఒకసారి, కొత్త కత్తులు సిద్దం చేస్తోంది. 
ఇప్పడు తాజాగా, శ్రీ వారి సేవా టికెట్ల రేట్లను,ఇష్టారాజ్యంగా పెంచేసింది, టీటీడీ. .ప్రస్తుతం కేవలం  రూ. 120 సాధారణ, రూ.240 సిఫార్సు సుప్రభాత సేవ టికెట్, ట్ ధరను ఏకంగా, రూ. 2000 పెంచేశారు. ఆలాగే, రూ. 220, రూ.440 ఉన్న సాధారణ, సిఫార్సు తోమాల,టికెట్ ధరను 5000 లకు పెంచేశారు. కళ్యాణోత్సవం రూ. 1000నుంచి ఏకంగా రూ. 2500 చేశారు. వేద ఆశీర్వచనం రూ. 3000 నుంచి మూడు రేట్లకు పైగా పెంచి రూ.10500చేశారు. వస్త్రాలంకరణ సేవ రూ.50000నుంచి రెట్టింపు చేసి రూ. అక్షరాల లక్షకు తీసుకు పోయారు. శ్రీ వాణి సేవ టికెట్ రేటు రూ.10,500 చేశారు. ఉదయాస్తమాన సేవను కోటిన్నర రూపాయలకు తీసుకు పోయారు. 

నిజానికి టీటీడీ ఇప్పుడేదో, సేవా టికెట్ల రేట్లు పెంచిందని కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు, ఏడు కొండలవాడి కొండ మీద జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అన్యమతస్తుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఈ అరాచకాన్ని అరికట్టేందుకు, తిరుమల సహా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మతస్థులను గుర్తించి, ఇతర శాఖలకు బదిలీ చేయాలని, తలపోసిన, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను, అదేదో మహా పాతకం అన్నట్లుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాత్రికి బదిలీ చేశారు. క్రైస్తవ సంస్థలు సీఎస్ బదిలీని సంబురాలు చేసుకున్నాయి.సీఎస్ ను రాత్రికి రాత్రి బదిలీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి  ఒక విధంగా అధికారులకు మాజోలికి వస్తే జాగ్రత్త అన్న హెచ్చరిక చేశారు.     

ఒక్క వెంకన్న దేవుని విషయంలోనే కాదు, అన్నిదేవాలయాలలో ఇదే తంతు నడుస్తోంది. హిందువుల మనో బావాలను దెబ్బ తీయడం, అన్య మతస్తుల ఆగడాలను ప్రోత్సహించడం జగన్ రెడ్డి ప్రభుత్వం ‘పవిత్ర’  కార్యంగా భావిస్తోందా అన్న విధంగా వ్యవహరిస్తోంది. 

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు, హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఈ రెండున్నర మూడు సంవత్సరాలలో 150కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుని రధాలు దగ్ధ మయ్యాయి. విగ్రహాలు ముక్కలయ్యాయి. హిందువుల గుండెలు బద్దలయ్యాయి. అయిన ఇంతవరకు ఒక్కటంటే ఒక్క కేసులో దాడులకు పాల్పడిన దుండగులు దొరకలేదు.అంతే కాదు, పుండు మీద కారం చల్లిన విధంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుతత్వం, దాడులు చేసిన వారు పిచ్చోళ్ళు, మతి స్థిమితం లేనోళ్ళు అంటూ దాడులను సమర్ధిస్తోంది. చివరకు దేవాదాయ శాఖ మంత్రి సహా అనేఅకమంది మంత్రులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అవహేళన చేశారు.  మరో వంక ప్రజల సొమ్ముతో చర్చిల నిర్మాణాలు చేపట్టింది.ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఏసు పాలనను తలపిస్తోంది అన్నా తప్పులేదు అనిపించేలా.. సాగుతోంది. నిజం, క్రైస్తఃవులే లేని ఊర్లలో నిబంధనలకు విరుద్ధంగా చర్చిల నిర్మాణం జరుగుతోంది. రాష్రంలో అన్యమత యధేచ్చగా, సర్కార్ మాది అన్న రీతిన సాగుతోంది. గ్రామాలకు గ్రామాలు ఏసు గ్రామాలుగా నామకరణం చేసుకుంటున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా జగన్ రెడ్డి పాలనలో హిందూ ధర్మం , హిందూ మతం, హిందువులు వివక్షకు గురవుతున్నారు. ఈ సమస్యకు సమాధానం ఏది...? వెంకన్న దేవా నీకొండను నీవే రక్షించుకో  .. అని వేడుకోవడమేనా ?