TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వీడియో కాల్ చేసి లైవ్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య.!

Published on: Mon Sep 21, 2026 3:00PM

అర్థరాత్రి వేళ ఓ యువతికి వీడియో కాల్ చేసి లైవ్ లో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ ఉదంతమిది. ఈ విషాద ఘటన హైదరాబాద్ మూసారాంబాగ్ లో చోటు చేసుకుంది.   హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ముత్తె చంద్రశేఖర్ (35) అనే కానిస్టేబుల్ ఈ ఘాతు కానికి పాల్పడ్డాడు.  ఎప్పుడూ నవ్వుతూ, తోటి సిబ్బందితో కలివిడిగా ఉండే చంద్రశేఖర్ ముసారాంబాగ్ ప్రాంతంలోని శాలివాహన నగర్‌లో ఉన్న తన నివాసంలో   అర్ధరాత్రి సమయంలో  తనకు పరిచయమున్న ఓ యువతికి   వీడియో కాల్ చేశాడు.

ఆమెతో మాట్లాడుతూ,  ఫోన్ లైవ్‌లో ఉండగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ యువతికి  చెప్పి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కంగారుపడిన ఆ యువతి, వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఆ సమాచారంతో  అప్రమత్తమైన  పోలీసులు వెంటనే   మలక్‌పేట్ పోలీసులకు  సమాచారం చేరవేశారు, వారు ముసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని చంద్రశేఖర్ ఇంటికి చేరుకునే సరికే చంద్రశేఖర్ ఉరి వేసుకుని మరణించాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

[Constable Suicide, Musarambagh, Malakpet Police Station, constable chandrashekhar, Videocall, Live Sucide, Telugu One]