ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ పై మళ్లీ బండ.!
Published on: Tue Sep 1, 2026 9:32AM
.webp)
వంటగ్యాస్ సిలెండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ఈ నెల మొదటి తారీకు నుంచే అంటే మంగళవారం నుంచే అమలులోకి వచ్చింది. అయితే ఈ పెంపు కేవలం వాణిజ్య సిలెండర్లకు పరిమితం చేయడం ఒకింత ఊరట కలిగించే అంశం. నెల నెలా మొదటి తేదీన గ్యాస్ ధరలను సమీక్షించి సవరించే ప్రక్రియలో భాగంగా చమురు సంస్థలు ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాయి.
ఈ పెంపుతో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలపై తొమ్మిదిన్నర రూపాయలు పెంచారు. అయితే గృహ వినియోగ ఎల్పీజీ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఈ పెంపుతో వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రెండు వేల 747.50 రూపాయలకు ఎగబాకింది. ఆర్థిక రాజథాని ముంబైలో ఈ ధర 2 వేల 701 రూపాయలకు పెరిగింది. తెలంగాణ రాజథాని హైదరాబాద్ లో అయితే వాణిజ్య గ్యాస్ సిలెండర్ ధర మూడు వేల రూపాయలకు చేరువైంది.
Commercial LPG Cylinder Price Hike, LPG Rates September, Domestic Gas Cylinder Prices, Oil Marketing Companies, Gas Price Update


