TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొద్దింకల ఆందోళన: పోలీసుల మోహరింపు..ఢిల్లీ, ముంబై షట్ డౌన్ అయ్యాయా?

Published on: Sat Oct 3, 2026 2:07PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ణానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బొద్దింకల పార్టీ చేపట్టిన ఆందోళనల కారణంగా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి విదితమే. 

ఇక ఇప్పుడు సీఈసీ జ్ణానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ తో పాటు, ముంబై లోని శివాజీ నగర్ పార్క్ వేదికగా ఏకకాలంలో ఆందోళనలు, నిరసనలకు పిలుపు ఇచ్చింది. అయితే ఈ ఆందోళనలకు ఢిల్లీ, ముంబై పోలీసులు అనమతి నిరాకరించారు. అయితే తమ ఆందోళన సాగించి తీరుతామన్న సీజేపీ ప్రకటనతో రెండు నగరాల్లోనూ కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.   

ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ పరిసరాలలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అలాగే.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా మోహరించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పలువురు రాజకీయ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, కార్యకర్తలు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి.

ఆందోళనలను అణచివేసేందుకు రాయిట్ కంట్రోల్ వెహికిల్స్ ను సైతం రంగంలోకి దించారు. రెండు నగరాల్లోని ప్రధాన కూడళ్ల వద్దా కూడా ఆంక్షలు అమలు చేస్తుండటంతో..బొద్దింకల ఆందోళనను విఫలం చేయడానికి ముంబై, ఢిల్లీ నగరాలను షట్ డౌన్ చేశారా అన్నట్లుగా వాతావరణం మారిపోయింది.

[Cockroach Janta Party, Delhi Mumbai protests, Chief Election Commissioner Gyanesh Kumar, Abhijeet Dipke, Shivaji Park Jantar Mantar Police Restrictions, Telugu One]