ప్రభావం చూపుతున్న బొద్దింకల ఉద్యమం.. హర్యానాలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ.!
Published on: Tue Sep 15, 2026 3:16PM
.webp)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. గతంలో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థులతో కలిసి భారీ ఆందోళనలు నిర్వహించి ఘన విజయం సాధించిన బొద్దింకల పార్టీ.. ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను ఎత్తిచూపుతూచేపట్టిన ఆందోళన మరో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల దుస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సంస్థ ప్రతినిధులు పలు ప్రాంతాల్లోని పాఠశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడ కనీస వసతుల లేమిని, అద్వాన పారిశుద్ధ్య పరిస్థితులను ఎ:డగడుతూ ఆందోళన చేపట్టారు. ఆ పోరాటాలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దిగివచ్చాయి.
తాజాగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగామౌలిక సదుపాయాలు లేని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదాదాపు 2 వేల814 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, వాటి ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించే దిశగా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన స్కూల్ ఠీక్ కరో (పాఠశాలలను బాగు చేయండి) ఉద్యమం కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని బయటపెట్టేందుకు సీజేపీ సభ్యులు చేసిన క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీలు అధికార యంత్రాంగంలో కదలిక తీసుకువచ్చాయి. ప్రాథమిక పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, మరుగుదొడ్లు, తాగునీరు సమస్యలు, సరిపడా గదులు లేకపోవడాన్నిబొద్దింకల ఉద్యమం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో ప్రభుత్వాలు దిగిరాక తప్పలేదు. ఒక్క హర్యానాలో మాత్రమే కాదు.. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది.
ఇదిలా ఉండగా.. గతంలో దేశ రాజధానిలో విద్యార్థుల సమస్యలపై నిర్వహించిన ఆందోళనలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను కదలించాయి. నీట్ పరీక్షల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి స్థాయిలో స్పందన వచ్చేలా చేసిన ఈ సంస్థ, ఇప్పుడు విద్యా రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అంశాన్ని తెరపైకి తెచ్చి మరోసారి తన ప్రభావాన్ని బలంగా చాటింది. రాజకీయాలకు అతీతంగా కేవలం సామాజిక, విద్యాపరమైన సమస్యలను మాత్రమే ప్రధాన అజెండాగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్న కాక్రోచ్ జనతాపార్టీ తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
దేశంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలను మార్చే దిశగా సాగుతున్న ఈ ఉద్యమంపై విద్యావేత్తలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పాఠశాలలను మూసివేయడం వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తినా.. దీర్ఘకాలంలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కలిగిన పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టుకొచ్చిన బొద్దింకల పార్టీ.. కేవలం డిజిటల్ నిరసనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలను కదిలించే స్థాయికి ఎదగి ప్రభుత్వాలను సమస్యల పరిష్కారం దిశగా దిగివచ్చేలా చేయడం విశేషం.
[Cockroach Janta Party, CJP, School Thik Karo Campaign, Haryana Government Schools, CJP Revolutionary Fight, Telugu One]


