TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొద్దింకల ఆందోళనకు విరామం: ఎప్పటి వరకూ, .. ఎందుకు.?

Published on: Wed Oct 21, 2026 10:09AM

కాక్రోచ్ జనతా పార్టీ తన ఆందోళనకు విరామం ప్రకటించింది. ఆ పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇందుకు సంబంధించి స్వయంగా ప్రకటించారు.  దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.  పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు,  మద్దతుదారులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపేందుకు ఈ విరామాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ణానేశ్వర్ కుమార్ రాజీనామా సహా పలు   ప్రజా సమస్యలపై రాజధాని ఢిల్లీలో సీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల సమయంలో భద్రతా బలగాలు,  పోలీసుల అణచివేత కారణంగా పలువురు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కార్యకర్తల కుటుంబాలపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయనీ, అందుకే కార్యకర్తలు, నాయకులు  పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు ఈ తాత్కాలిక విరామ నిర్ణయం తీసుకున్నట్లు అభిజీత్ దీప్కె పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా పార్టీ ప్రముఖ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్టులు,  జ్యుడీషియల్ కస్టడీ గురించి అభిజీత్ దిప్కే ప్రస్తావించారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జైలులో గడిపినప్పటికీ వారి మొహంలో ఎలాంటి భయం కనిపించలేదని, వారి ధైర్యసాహసాలు పార్టీ శ్రేణులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని   కొనియాడిన ఆయన  చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజా సమస్యలపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తామన్నారు.  


[Cockroach Janata Party Gives Break Agitation, Diwali Protest Pause, CJP Agitations, Telugu One]