TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే వేదికపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు.!

Published on: Fri Aug 21, 2026 10:46AM

చెన్నై వేదికగా జరిగిన  సదరన్   జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. కర్నాటక, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలతో తరచూ ఆయా రాష్ట్రాల మధ్య ఉద్రక్తతలు, వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసందే. ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 

ఏపీ సీఎం చంద్రబాబు, కర్నాటక సీఎం డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్.. ఇలా అందరూ ఒకే  ఫ్రేమ్ లో కనిపించారు.  రాజకీయ వైరుధ్యాలను, ప్రాంతీయ విభేదాలనూ  పక్కనపెట్టి ఒకే వేదికపై వీరు కలవడం పట్ల పరిశీలకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటమే ఇందుకు కారణం. అయితేనే.. ఏపీ తెలంగాణ సీఎంలు ఇటీవల పలు సందర్భాలలో ఒకే వేదికపై కనిపించి.. తలుగు రాష్ట్రాల ప్రగతి, పురోభివృద్ధికి సమష్టిగా పని చేస్తామని చాటిన సంగతి లెలిసిందే.    

సదరన్   జోనల్ కౌన్సిల్ సమావేశం అంతర్రాష్ట్ర సమన్వయం పెరగడానికి, వివాదాల  పరిషారానికి దోహదపడుతుందనీ, ఈ సమావేశం సుహృద్భావ వతావరణంలో సాగడమే ఇందుకు నిదర్శనమనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

CMs in one frame, Southern Zonal Council Meeting, Chandrababu Naidu, DK Shivakumar, Joseph Vijay