త్రిష ఎంట్రీ.. ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్..!
Published on: Sun Sep 13, 2026 6:08PM
.webp)
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీజే విజయ్, ప్రముఖ నటి త్రిషల కలయికకు సంబంధించిన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది. బ్రిటన్‌లోని ప్రసిద్ధ సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన మిచెలిన్ లే మాన్స్ కప్ మోటార్ రేసింగ్ ఈవెంట్ వేదికగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అధికారిక పర్యటనలో భాగంగా యూకే వెళ్లిన సీఎం విజయ్, అక్కడ రేసింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ 44-కార్ల ప్రతిష్టాత్మక గ్రిడ్ రేస్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా గ్రీన్ ఫ్లాగ్ ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు దిగ్గజ నటులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కోలీవుడ్ వర్గాల్లో అభిమానులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత 34 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అజిత్ కుమార్ స్వయంగా సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే సమయంలో లండన్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రముఖ నటి త్రిష కూడా సరిగ్గా ఇదే సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్ ప్రాంతంలో ప్రత్యక్షమవడం సర్వత్ర చర్చనీయాంశమైంది.
.webp)
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ త్రిషతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేక్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రేసింగ్ ఈవెంట్ జరిగే వేదిక వద్ద విజయ్, త్రిష ఒకే ప్రాంతంలో ఉండటం, వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడం వేగంగా జరిగిపోయాయి. ముఖ్యంగా కెమెరా కంట పడగానే ఇద్దరూ అప్రమత్తమై రైలింగ్ పక్కనుంచి కాస్త పక్కకు తప్పుకున్న క్లిప్స్ సోషల్ మీడియాలో రికార్డుస్థాయిలో వ్యూస్‌ను రాబడుతున్నాయి. ఇప్పటికే విజయ్-త్రిషల మధ్య వ్యక్తిగత సంబంధాలపై రకరకాల రూమర్లు, ఊహాగానాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ, చెన్నైలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఏకంగా వేరే దేశంలో, ఒకే అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ వేదికపై వీరిద్దరూ కనిపించడంతో ఈ పుకార్లు మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినప్పటికీ, అభిమానులు రాజకీయ ప్రత్యర్థులు సై దీనిపై విభిన్న కోణాల్లో చర్చించుకుంటున్నారు. చెన్నై వేదికగా ఇలాంటి అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించే ప్రణాళికలపై సీఎం విజయ్ కసరత్తు చేస్తుండగా, ఈ యూకే పర్యటన మాత్రం రాజకీయంగానూ, సినిమా పరంగానూ ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు.
[ CM Vijay UK tour, Ajith Kumar racing, Silverstone Circuit, Trisha London shoot, Thalapathy Vijay news, Vijay and Ajith, Le Mans Cup Silverstone, Tamil cinema news, Vijay Ajith friendship, Tamil Nadu politics and cinema ]


