TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకున్న సీఎం విజయ్: తమిళ రాజకీయాలలో సంచలన పరిణామాలు.!

Published on: Thu Nov 12, 2026 1:59PM

తమిళనాడులో అధికార టీవీకే పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి దుమారం రేపుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు తమిళరాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా  రాష్ట్ర ముఖ్యమంత్రి టీవీకే అధినేత  విజయ్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, వారి నుంచి రాజీనామా పత్రాలను తీసుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల మామల్లపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన రహస్య సమావేశంలో   ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటంతో  పాటు పార్టీలో క్రమశిక్షణ తీసుకు వచ్చే దిశగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  

ఈ సమావేశంలో భాగంగా పార్టీకి చెందిన కొందరు మంత్రులు,  ఎమ్మెల్యేల నుంచి సంతకం చేసిన ఖాళీ పత్రాలను (రాజీనామా పత్రాలుగా భావిస్తున్నారు) సేకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి లేదా ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా ఎవరైనా వ్యవహరించినా, లేక పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తించినా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా  ఆ పత్రాల ద్వారా వారు రాజీనామా చేసినట్లుగా భావించి వాటిని ఆమోదంచడానికే ఆయనీ చర్య తీసుకున్నారని అంటున్నారు.  

ఇటీవల కాలంలో కొందరు టీవీకే ఎమ్మెల్యేలు వివాదాలలో చిక్కుకోవడం తెలిసిందే. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ప్రజలతో మెలగడంలో జరిగిన పొరపాట్లు, అధికారుల పట్ల వ్యవహరించిన తీరు వంటి కొన్ని ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మారాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం విజయ్, సంబంధిత ప్రజాప్రతినిధులను గట్టిగా మందలించడంతో పాటు,  భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి:   గీత దాటుతున్న టీవీకే ఎమ్మెల్యేలు: సీఎం విజయ్ ఏం చేస్తున్నారు.!

ఈ మెత్తం వ్యవహారంపై డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె  కనిమొళి చేసిన ఓ ట్వీట్ కారణం అని అంటున్నారు.  కళ్లకురుచి జిల్లా కలెక్టర్   పద్మజ  కు స్థానిక టీవీకే ఎమ్మెల్యే   అరుళ్ విగ్నేశ్ నుంచి వేధింపులు ఎదురయ్యాయంటూ ఆమె ట్వీట్ చేశారు. సదరు ఎమ్మెల్యే  వాట్సాప్‌లో కలెక్టర్ కుఅసభ్య సందేశాలు పంపడమే కాకుండా, తప్పతాగి,  అనుమతి లేకుండా కలెక్టర్ నివాసానికి వెళ్లి వేధించారని ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ   ఘటన తర్వాత కలెక్టర్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిని  కేటాయించారని కనిమెళి తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే కనిమెళి ఆరోపణలను సదరు ఎమ్మెల్యే ఖండించారనుకోండి అది వేరే విషయం. అయితే  ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సీఎం విజయ్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ఇటీవలి కాలంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని, కట్టు దాటితే వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. గీత దాటుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులను నియంత్రించకుండా ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతుందని పరిశీలకులు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

మీకు నచ్చవచ్చు: తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.!

తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే విజయ్!

[CM Vijay, TVK MLAs, Resignationletters, Party Discipline, TeluguOne]