Latest News
ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
posted on: Mar 20, 2026 8:16PM
.webp)
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


.webp)



