గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష..!
Published on: Sat Sep 12, 2026 4:05PM
.webp)
హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల సమన్వ యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వ హించాలని అధికారులను ఆదేశించారు. మా ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పున రుద్ధరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు, గణేశ్ ఉత్సవాల నిర్వాహకుల సమస్యలను తెలుసుకునేందుకే స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని చెప్పారు.
గణేశ్ మండ పాలకు ప్రముఖులు, అతిథులను ఆహ్వానించే సందర్భంలో వారి వివరా లను స్థానిక కమిషనరేట్ కు అందించాలని సీఎం సూచించారు. ఊహించని పరిణామాలు చోటుచేసు కున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు.ఎక్కడెక్కడ గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలని నిర్వాహకులను కోరారు. మండపాల వివరాలు ముందుగానే అందు బాటులో ఉంటే ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు పోలీసులకు మరింత సులభంగా ఉంటాయని చెప్పారు.
.webp)
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగానే గణేశ్ నిమజ్జనాలకు అనుగు ణంగా కూడా ముందుగానే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. చెరువుల అభివృద్ధి పనులు చేపట్టే సమయంలోనే గణేశ్ నిమజ్జనాలకు అవసర మైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించా లని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారు లను నియమించాలని తెలిపారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచిం చారు.హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నగరంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహిం చాలని సూచించారు. గణేశ్ ఉత్సవాల సంద ర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కూడా పోలీస్, ప్రభుత్వ శాఖలకు సహకరించాలని కోరారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకుల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు
[ CM Revanth Reddys key review on Ganesh festivals, Telangana Goverment, Hyderabad Command Control Center, CP Sajjanar, DGP C.V. Anand,Telugu One, Telugu News ]


